NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Bharat Ane Nenu : తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ మహేష్ బాబు ఫ్యాన్సేనా..? ఫ్రూవ్ ఇదిగో..!!

Bharat Ane Nenu : రాజకీయాలలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలంగాణ సీఎం కేసిఆర్ కంటే చాలా జూనియర్ అయినప్పటికీ తన దైన మార్కు ప్రదర్శిస్తూ సీనియర్ లను తలదన్నేలా నిర్ణయాలను తీసుకుని ముందుకు సాగుతున్నారు. కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నప్పటికీ మెజార్టీ శాతం ప్రజలకు ఉపయోగపడేవి కావడంతో ప్రజలు భ్రహ్మరథం పడుతున్నారు. అందుకు తార్కాణం ఇటీవల జరిగిన పంచాయతీ, పురపాలక ఎన్నికల ఫలితాలను పేర్కొనవచ్చు. ఏపిలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతున్నాయి. కాగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ఇరుగుపొరుగు తెలుగు రాష్టాలు కావడంతో ప్రజలు అక్కడి కెసిఆర్ సర్కార్ నిర్ణయాలు, ఇక్కడి జగన్ ప్రభుత్వ నిర్ణయాలను పోల్చి చూస్తుంటారు. ఇకపోతే ఇటు జగన్మోహనరెడ్డి, అటు కేసిఆర్ తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు పరిశీలిస్తే ఇద్దరు సీఎంలు సినీ నటుడు మహేష్ బాబు ఫ్యాన్స్ యేనా అని నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు.

 

telugu states cm's Bharat Ane Nenu concept
telugu states cms Bharat Ane Nenu concept

గతంలో జగన్మోహనరెడ్డి రవాణా శాఖలో నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు భారీగా జరిమానాలు విధించేలా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులు వచ్చిన కొత్తలో పెద్ద ఎత్తున జరిమానాలు వసూలు చేశారు. నాడు అందరూ అనుకున్నది ఏమింటే మహేష్ బాబు నటించిన “భరత్ అనే నేను” అనే సినిమా స్పూర్తితో వాహనదారులకు భారీగా పెనాల్టీలు విధిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే వాహనదారుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తరువాత ప్రభుత్వ సూచనలతో అధికారులు ఆ ఆదేశాలను పక్కన పెట్టారు.

telugu states cm's Bharat Ane Nenu concept
telugu states cms Bharat Ane Nenu concept

ఇప్పుడు అదే “భరత్ అనే నేను” సినిమాలోని ఒక కాన్సెప్ట్ ను తెలంగాణ సీఎం కేసిఆర్ అందిపుచ్చుకున్నారు. అది ఏమిటంటే గ్రామ పంచాయతీలకు సర్వాధికారాలు ఇవ్వడం. ఇకపై తెలంగాణ లోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి పనుల నిర్వహణకు ఉన్నతాదికారుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదనీ కేసిఆర్ ప్రకటించారు. గ్రామ సభ తీర్మానం చేసుకుని వర్క్స్ చేసుకోవచ్చని తెలిపారు. అందుకు సంబంధించిన జీవో నేడు కేసిఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇంతకు ముందు లక్ష లోపు పనులకు డీపిఓ, ఆ పై పనులకు ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా జివోతో ఇకపై గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పనులకు సంబంధించి తీర్మానాలను గ్రామ సభలో ఆమోదించి చేసుకోవచ్చు. నాడు ఏపి సీఎం జగన్, నేడు తెలంగాణ సీఎం కెసిఆర్ లు తీసుకున్న నిర్ణయాలు “భరత్ అనే నేను’ సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ బాబు అమలు చేసినవి కావడంతో ఇద్దరు సీఎంలు ఆయనకు ఫ్యాన్స్ అయ్యింటారని అనుకుంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N