ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. జీవో నెంబర్ ఒకటిపై తాము ఇచ్చి వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. మరో వేపు మంత్రులు టీడీపీ సభ్యులతో వాదనకు దిగారు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాన్ని వాయిదా వేశారు.

తమపై వైసీపీ సభ్యులు దాడి చేశారంటూ టీడీపీ సభ్యులు ఆరోపించారు. స్పీకర్ పై పేపర్లు చించివేస్తూ బీభత్సం సృష్టించారని టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే లు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లు తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి దిగారని ఆరోపించారు. టీడీపీ సభ్యులే తమపై దాడి చేశారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించారు. వీడియో పుటేజీని పరిశీలించాలని వారు కోరుతున్నారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

సభ జరుగుతుండగా అకస్మాత్తుగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ప్రత్యక్ష ప్రసారాలను కూడా నిలుపుదల చేశారు. సభను వాయిదా వేసిన స్పీకర్ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. వెల్ లో కూర్చుని టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. సభలో కావాలనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రశ్నోత్తరాలను అడ్డకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదని అన్నారు. టిడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన ముంబాయి పోలీసులు