NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

YS Jagan : జగన్ను బిజెపి దూరం చేసుకోదు చేసుకోలేదు!!

YS Jagan  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను భారతీయ జనతా పార్టీ ఈ పరిస్థితుల్లో దూరం చేసుకోదు.. చేసుకోవాలని ఆలోచనను రానివ్వదు. కారణం ఏమిటి అనేది ఆలోచిస్తే, జగన్ పదేపదే ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది. కర్ర విరగకూడదు పాము చావాలి అనే సేఫ్ గేమ్ ఆడే బిజెపి తన అవసరాన్ని తీర్చుకుంటూనే, అవసరం మేరకు జగన్ను వాడుకోవాలని భావిస్తోంది.

బిజెపి 2024 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ గ్రాఫ్ తో పాటు బీజేపీ పార్టీ హవా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. దీంతోనే పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో విజయం కోసం బిజెపి నానా రకాల దారులు వెతుకుతోంది. అంటే 2019 లో వచ్చిన 303 లోక్సభ స్థానాల్లో సగం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంటే ఇప్పుడు బీజేపీ కు మిత్రపక్షాల సహకారం ఎంతో అవసరం.

భారతదేశ రాజకీయాలు నిర్దేశించే ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ పరిస్థితి అంతగా బాగాలేదు. ఎక్కడ 80 లోక్సభ స్థానాల్లో 2014లో 71 ఒక లోక్సభ స్థానాలు గెలుచుకున్న బిజెపి 2019లో కేవలం 63 లోక్సభ స్థానాలు తోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం యోగి ప్రభుత్వం మీద ఉత్తరప్రదేశ్లో సానుకూలత లేదు. అందులోనూ 2022 లో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అక్కడి పరిస్థితి మీద బిజెపి ఓ అంచనాకు రావచ్చు. అక్కడ వచ్చే ఫలితాలు ఆధారంగా బిజెపి వ్యూహాలు మారవచ్చు.

ప్రస్తుతం బీజేపీ కు ఎన్డీఏ యుపిఎ కూటముల్లో భాగస్వామ్యం కానీ రాజకీయ పార్టీలను దగ్గరకు తీసుకోవాలి అన్నది ప్రధాన కాన్సెప్ట్. అందులోనూ రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు గా చేర్చుకోవాలి అని ఆర్ఎస్ఎస్ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంతోనే ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న అధికార పార్టీ ని ఎన్డీఏలో చేరమని ఇప్పటికే ఢిల్లీ పెద్దలు కోరారు. దీని మీద మంతనాలు జరిపేందుకు, ఉన్న అవకాశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ ను ప్రతి సారి ఢిల్లీ కి రమ్మని పిలుస్తున్నారు.

మరోపక్క కేంద్రంలో మూడో కూటమి ఏర్పాటు చేస్తానని చెబుతున్న కెసిఆర్ ను బిజెపి పెద్దలు అంతగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇక్కడ సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్. అంతేకాకుండా తెలంగాణలో 17 లోక్సభ సీట్లలో కనీసం పది గెలుచుకున్న కెసిఆర్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నది బిజెపి అభిప్రాయం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కాంగ్రెస్ కూటమి లోకి వెళ్లే అవకాశం లేదు అని బిజెపి లెక్కలు వేస్తోంది. ఆయనకు గతంలో సోనియా గాంధీకి వున్న కొన్ని మనస్పర్థల కారణంగా జగన్ కచ్చితంగా యూపీఏ కూటమిలో కి వెళ్లారాని అంచనా వేస్తున్న బిజెపి, జగన్ ను దగ్గర చేసుకోవాలని భావిస్తోంది.అయితే దీనికి ప్రస్తుతానికి ఓకే చెప్పకుండా తాత్సారం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై రక రకాల ఒత్తిళ్లు, భయాలు, అంశాలను విడతలవారీగా తెరపైకి తేవడం చూడొచ్చు.

జగన్ కనుక ఎన్డీఏ పక్షంలో చేరుతున్నట్లు ప్రకటిస్తే వెనువెంటనే ఆంధ్రప్రదేశ్కు వరాల వాన కురవొచ్చు. అయితే జగన్ మాత్రం 2024 లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావిస్తుండటం వల్లే ఎన్డీఏలో ముందుగానే చేరితే, తర్వాత ఇతర పక్షాల కు తమ రాజకీయ వ్యూహం అర్థమయ్యే అవకాశం ఉండడంతో జగన్ దీనికి నో చెబుతున్నట్లు తెలుస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk