NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

nimmagadda vs jagan: జగన్ కి సపోర్టుగా రంగంలోకి దిగబోతున్న గవర్నర్ ? ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్?

ఏపిలో స్థానిక ఎన్నికల పంచాయతీ రసకందాయంగా ఉంది. ఒక పక్క ఎన్నికలు ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేయాలని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు పట్టుబడుతుండగా, మరో పక్క ఎట్టిపరిస్థితిలోనూ జరిపి తీరాలన్న కృత నిశ్చయంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎన్నికల విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. ఈ లోపుగానే శనివారం తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇప్పుడు అసలు సినిమా ప్రారంభం అవుతోంది. ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా సిబ్బంది అంటూ ఏది లేదు. ప్రభుత్వ సిబ్బందే ఎన్నికలకు సహకరించాల్సి ఉంటుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సిబ్బంది ససేమిరా అంటున్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ తో ఎస్ఈసీకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించవద్దంటూ లేఖ రాయించారు. అయినప్పటికీ ప్రభుత్వ విజ్ఞప్తిని ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మగడ్డ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ద్వారా పావులు కదపడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్మోహనరెడ్డి సర్కార్ కు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తున్నందున చివరి అస్త్రంగా గవర్నర్ ను రంగంలోకి దింపే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇల్లు అలకగానే పండుగ కానట్లు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రన ఎన్నికలు జరిగిపోతాయనే భావన వైసీపీలో లేదు. గత మార్చి నెలలో ఎంపిటీసిీ, జడ్పీటీసీ ఎన్నికలను నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తరువాత కూడా ఎస్ఈసీ ఏకపక్షంగా వాయిదా వేసిన సందర్భం కూడా ఉంది. సోమవారం సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ ద్వారా నిమ్మగడ్డ దూకుడును కట్టడి చేయాలన్న ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు మూకుమ్మడిగా సహాయ నిరాకరణ చేస్తే ఎన్నికల సంఘం కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉంది. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయడం తప్ప ఎస్ఈసీ నేరుగా చేసేది ఏమి లేదు. ఇప్పటికే పలువురు అదికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ సిఫార్సు చేసినా వారు కరోనా వ్యాక్సినేషన్ విధుల్లో ఉన్నారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే వెనుకేసుకువచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా సస్పెన్షన్లకు తాము భయపడమని అంటున్నారు. అంతిమంగా ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju