NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Steel Plant: ఏపికి ఒకే రోజు ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్..! అవి ఏమిటంటే..?

Steel Plant: ఆంధ్రప్రదేశ్ లో భారీ గా పెట్టుబడులు పెట్టేందుకు, స్టీల్ ప్లాంట్ ఏర్పాటునకు ఓ ప్రముఖ సంస్థ ముందుకు రావడం గుడ్ న్యూస్ కాగా మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం మరో ముందడుగు వేయడం బ్యాడ్ న్యూస్. ఈ పరిణామాలు బుధవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూపు సన్నద్ధత వ్యక్తం చేసింది. ఎస్సార్ గ్రూపు ప్రతినిధులు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ కు తెలియజేశారు. ఈ ఏడాది నవంబర్ నెలలో స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేస్తామని సీఎం జగన్ కు ఎస్సార్ గ్రూప ప్రతినిధులు తెలిపారు. సీఎం జగన్ ను కలిసిన వారిలో ఎస్సార్ గ్రూపు హెడ్ ప్రశాంత్ రూయా, వైస్ చైర్మన్ జె మెహ్రా, ఏపి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి లు ఉన్నారు.

The Sale of Visakhapatnam Steel plant is another step forward
The Sale of Visakhapatnam Steel plant is another step forward

Read More: Mamata Banerjee: దీదీ ఇల్లు అలకగానే పండుగ కాదు.. మండలి తీర్మానానికి మోడీ మద్దతు ఇస్తారా..? జరిగితే వండరే..!!

కాగా ఓ పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కార్మిక సంఘాలతో పాటు వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. సీఎం వైఎస్ జగన్ గతంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికే ముందడుగు వేసింది.

The Sale of Visakhapatnam Steel plant is another step forward
The Sale of Visakhapatnam Steel plant is another step forward

కన్సల్టెంట్ నియామకానికి కేంద్రం నోటిపికేషన్ జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ సంస్థలన్నీ వంద శాతం అమ్ముతామని ప్రకటనలో కేంద్రం పేర్కొన్నది. ఏపిలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ ప్లాంట్ మైన్స్ ను కూడా అమ్మకానికి కేంద్రం పెట్టింది. బిడ్ లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్ గ్యారెంటీ  చూపాలని నోటిఫికేషన్ లో కేంద్రం పేర్కొన్నది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N