NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Lock down: లాక్ డౌన్ కేసీఆర్ పంట పండించిన మూడు అంశాలు ఏంటంటే…

Lock down: క‌రోనా క‌ల్లోలం కార‌ణంగా విధించిన లాక్ డౌన్ వ‌ల్ల పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయిన‌ట్లు ప‌లు సంద‌ర్భాల్లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ లాక్ డౌన్‌లోనే ప‌లు అంశాల్లో తెలంగాణ స‌ర్కారుకు భారీ ఆదాయం స‌మ‌కూరింది. ఈ విష‌యాన్ని సాక్షాత్తు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ప‌లు కీల‌క విష‌యాలు తెలిపారు. ఇదిలాఉండ‌గా లిక్క‌ర్ తో సైతం భారీ ఆదాయం వ‌చ్చింది.

Read More : YS Jagan: క‌రోనా ఉంటే ఏంటి… జ‌గ‌న్ దూకుడు ఏ మాత్రం త‌గ్గ‌ట్లే

లాక్ డౌన్ లో పైస‌లే పైస‌లు…
లాక్ డౌన్ ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు, రూ.35.81 కోట్ల జరిమానా విధించామని డీజీపీ తెలిపారు. సోష‌ల్ డిస్టెన్స్ పాటించనందుకు 41,872 కేసులు నమోదు చేశామన్నారు. జనం గుమిగుడినందుకు 13,867 కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదు చేశామని డీజీపీ నివేదికలో తెలిపారు.

Read More : Corona: షాక్ఃక‌రోనా టీకా ప‌నిచేయ‌డం లేద‌ని కేసు పెట్టాడు

లిక్క‌ర్ తో కోట్లు
మ‌రోవైపు రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ ఉన్నా లిక్కర్ సేల్స్‌ తగ్గలేదు. ఇటీవలిదాకా వైన్స్​కు పొద్దున పూట 4 గంటల టైం మాత్రమే ఉన్నా లిక్కర్ సేల్స్ బాగానే జరిగాయి. మే నెలలో మొత్తం రూ. 2,116 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి తరలింది. ఇందులో 26 లక్షల కేసుల ఐఎంఎల్, 20 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో రూ. 448 కోట్లు, నల్గొండలో రూ. 241 కోట్లు, హైదరాబాద్‌లో రూ. 191 కోట్లు, వరంగల్‌ అర్బన్‌లో రూ.180 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది మే నెలలో లాక్​డౌన్ లేదు. అప్పుడు రూ.2,270 కోట్ల లిక్కర్‌ సేల్‌ అయ్యింది. ఈసారి లాక్​డౌన్ ఉన్నా.. మద్యం అమ్మకాలు జోరుగానే సాగాయి. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రూ. 154 కోట్ల విలువైన లిక్కర్‌ డిపోల నుంచి తరలింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు నెలల్లో రూ.4,388 కోట్ల లిక్కర్‌ అమ్ముడైంది. వీటి నుంచి స‌హ‌జంగానే భారీగా స‌ర్కారుకు ఆదాయం వ‌చ్చింది.

author avatar
sridhar

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju