NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

ఏపీ అధికార పార్టీలో ఇప్ప‌టికే 175 అసెంబ్లీ స్థానాల‌కు 25 పార్ల‌మెంటు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. ఒకేసారి ఈ జాబితాల‌ను(ఒక్క అన‌కాప‌ల్లి త‌ప్ప‌) విడుద‌ల కూడా చేశారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో కూట‌మి అభ్య‌ర్థుల బ‌లాబలాలు.. త‌మ పార్టీ అభ్య‌ర్థుల లోటు పాట్ల‌ను అంచ‌నా వేసుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మార్పులు త‌ప్ప‌వ‌ని నిర్ణ‌యించుకున్నారు. నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు ఐదు రోజుల వ‌రకు స‌మ‌యం ఉన్నందున‌.. ఈలోగానే మార్పులు చేయ‌డం ఖాయ‌మని తెలుస్తోంది. వీటిలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి. చిత్రం ఏంటంటే.. మార్పులు ఉండ‌వ‌ని చెబుతున్నా.. ఖాయ‌మ‌ని మాత్రం పార్టీ కీల‌క నేత‌లే చెబుతున్నారు.

+ మైల‌వరం: సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ టీడీపీ నుండి పోటీ చేస్తున్నారు. వైసీపీ కుల స‌మీక‌ర‌ణాల లెక్క‌లు వేసుకొని చివ‌ర‌కు మైల‌వ‌రం ఎంపీపీగా ఉన్న స‌ర్నాల తిరుప‌తిరావు యాద‌వ్‌ను ప్ర‌క‌టించింది. అయితే.. రూపాయికి వెనుకాడ‌ని వ‌సంత ముందు స‌ర్నాలు తేలి పోతున్నారు. దీంతో ప్ర‌స్తుతం పెన‌మలూరు నుంచి బ‌రిలో ఉన్న‌ మంత్రి జోగి ర‌మేష్ ను మైల‌వ‌రం పంపించ‌డం ఖాయ‌మ‌ని తేలిపోయింది.

+ గుంటూరు ఎంపీ: మంత్రి విడ‌ద‌ల ర‌జినీ గుంటూరు వెస్ట్ నుంచి పోటీలో ఉన్నారు. కానీ, ఈమెను గుంటూరు ఎంపీ స్థానానికి బ‌దిలీ చేయ‌డం ఖాయ‌మైంది. ఆమె గ‌త రెండు రోజులుగా వెస్ట్‌లో ప్ర‌చారం ఆపేశారు. రంజాన్ అని చెబుతున్నా.. అస‌లు కిటుకు మార్పేన‌ని పార్టీ వ‌ర్గాలే చెబుతున్నాయి. ఎంపీ అభ్యర్థిగా ఉన్న కిలారు రోశయ్యను వెస్ట్‌కు పంపించ‌నున్నారు.

+ విజ‌య‌వాడ వెస్ట్: జ‌న‌సేన నుండి రెండు రోజుల కింద‌ట వైసీపీలో చేరిన పోతిన మ‌హేష్ కు విజ‌య‌వాడ వెస్ట్ సీటు కేటాయించ‌డం ఖాయ‌మైంది. ఈ హామీతోనే ఆయ‌న పార్టీలో చేరార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇక్క‌డి ఆసిఫ్‌కు.. ఎమ్మెల్సీ ఇచ్చి బుజ్జ‌గించే వ్యూహాన్ని వైసీపీ అమ‌లు చేస్తోంది.

+ అద్దంకి: ఇక్క‌డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణెం హనిమిరెడ్డిని మార్చేయ‌డం ఖాయంగా తెలుస్తోంది. కుదిరితే.. క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తికే ఈ టికెట్ ఇవ్వ‌నున్నారు. ఆయ‌న కూడా సై అంటున్నారు. ఆయ‌న కుమారుడు వెంక‌టేష్‌.. చీరాల నుంచి బ‌రిలో ఉన్న విష‌యం తెలిసిందే.

+ కర్నూలు ఎంపీ: ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉన్న బీవై రామయ్య ఏమాత్రంపోటీ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలో రెండు రోజుల కింద‌ట టీడీపీకి దూర‌మైన‌.. కేఈ ప్ర‌భాక‌ర్‌కు ఈ సీటును ముందుగానే రిజ‌ర్వ్ చేశార‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?