Raghurama krishnamraju: ఖాళీగా ఉండ‌లేక ర‌ఘురామరాజు ఏం చేస్తున్నాడంటే…

Share

Raghurama krishnamraju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు త‌న‌దైన శైలిలో వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. సొంత పార్టీకి వ్య‌తిరేకంగా, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గిట్ట‌ని విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ఘురామ కృష్ణంరాజు ఇటీవ‌లే అరెస్టై బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే, ఏపీ సీఐడీ అధికారులు తనపై మోపిన రాజద్రోహం కేసు, అరెస్టైన త‌ర్వాత సీబీఐ కస్టడీలో దాడి ఇతర అంశాల‌పై ఆయ‌న త‌న గ‌లం విప్పుతున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఎంపీల‌కు, ప్రధాని మోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దానికి కొన‌సాగింపుగా ఎంపీ రఘురామ తాజాగా అన్ని రాష్ట్రాల సిఎంలకు లేఖలు రాశారు. అయితే, ఈ లిస్టులో ఏపీ సీఎం జగన్ పేరు లేదు!

 

Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్ర‌క‌టించారో తెలుసా?

ర‌ఘురామ ఏమంటున్నారంటే…

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం వ‌ల్ల కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్టు చేయించారని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు రాసిన లేఖ‌లో ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఏపీ సీఐడీ పోలీసులు త‌న‌ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు రఘురామ కృష్ణంరాజు సీఎంల‌కు రాసిన‌ లేఖలో ప్రస్తావించారు. రాజద్రోహం శిక్షకు వ్యతిరేకంగా క‌లిసిక‌ట్టుగా ఉద్యమించాలని, రాజద్రోహం సెక్షన్ తొలగించేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అన్ని రాష్ట్రాల సీఎంలను లేఖ‌ల ద్వారా రఘురామ కోరారు. రాజ‌ద్రోహం విష‌యంలో పార్లమెంటులో తన వాద‌న‌కు మద్దతు ఇచ్చేలా ఆయా రాష్ట్రాల‌ ఎంపీలకు సూచించాలని అన్ని రాష్ట్రాల సీఎంల‌ను రఘురామ ఈ లేఖ‌ల్లో కోరారు.

Read More: YS Jagan: కేసీఆర్‌, జ‌గ‌న్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స‌మస్య ఇదే

ఎంపీపై వస్తున్న కామెంట్ ఇదే…

ఇదిలాఉండ‌గా , ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు రాస్తున్న లేఖ‌ల‌పై ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. బెయిల్ కేటాయింపు స‌మ‌యంలో మీడియాతో మాట్లాడ‌వ‌ద్ద‌ని కోర్టు స్ప‌ష్టంగా ఆదేశించ‌డంతో ఏం చేయాలో తోచ‌ని ర‌ఘురామ ఇలా లేఖ‌లు రాస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఎంపీ రాసే లేఖ‌లతో సీఎంలు స్పందిస్తారా? వాస్త‌వాలు తెలుసుకోకుండానే ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతారా అని సెటైర్లు వేస్తున్నారు.

 


Share

Related posts

AP High Court: బిగ్ బ్రేకింగ్..జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!!

somaraju sharma

Poorna Latest HD Photos

Gallery Desk

Gaurav Khanna: పారా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కోసం తన 15 ఏళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన కోచ్ గురించి తెలుసుకుందాం..!

arun kanna