BRS: బీఆర్ఎస్ పార్టీ విస్తరణ ఏపీలో కూడా జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కోటా చంద్రశేఖర్ నీ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ కేంద్రంగా రావేల కిషోర్ బాబు బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ నేతలు కూడా పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ వెంట కలిసి నడవడానికి చాలా వర్గాల ప్రజల సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీలో జాయిన్ అయినా నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. బీఆర్ఎస్ అజెండాను దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లక్ష కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఏ కార్యక్రమమైనా చిన్నదిగా మొదలయ్యి విజయ తీరం చేరాలంటే ఎన్నో అవహేళనలు దాటాలని అన్నారు. స్పష్టమైన లక్ష్యం ఉన్న వారికే విజయలక్ష్మి వరిస్తుందని చెప్పుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. స్వాతంత్ర ఫలాలు ఇప్పటికి పూర్తిస్థాయిలో సిద్ధించలేదని అన్నారు.

మతకల్లోలాలు, డబ్బు కుమ్మరింపు, కోట్ల అబద్దాలు.. ఈ రీతిలో ఏం చేసైనా సరే ఎన్నికల్లో గెలవటమే లక్ష్యం అయ్యిందని తెలిపారు. యువ రాజకీయాలకు ఉండాల్సిన లక్షణాలు కాదు. సహజత్వానికి దూరంగా ఇప్పుడు నాయకత్వాలు ఉన్నాయని పేర్కొన్నారు. నీటి కోసం ఇంకా రాష్ట్రాల మధ్య విధాలు దేశ రాజధాని ఢిల్లీలో సరిపడా నీళ్లు కూడా దొరకని పరిస్థితి. సరిపడా నీరు పనిచేసే జనాభా ఎక్కువ ఉన్న భారత్ ప్రపంచంలో అత్యధిక ఆహార ఉత్పత్తి దేశంగా మారాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.