Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొన్నసంఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన కడప జిల్లా చాపాడు వద్ద శుక్రవారం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు టెంపోలో తిరుమలకు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఓబులమ్మ, రామలక్ష్మమ్మ, అనూష అనే మహిళలు మృతి చెందినట్లుగా గుర్తించారు. పొగ మంచు వల్ల ఆగి ఉన్న లారీని టెంపొ డ్రైవర్ గుర్తించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. దైవదర్శనానికి బయలు దేరిన వారిలో ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
గూగుల్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు