Kakinada: కాకినాడ జిల్లా తాండంగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్రావెల్ లోడ్ తో వెళుతున్న లారీ బీభత్సం సృష్టించడంతో ముగ్గురు మృతి చెందారు. అన్నవరం నుండి ఒంటిమామిడి వైపు వెళుతున్న గ్రావెల్ లోడ్ లారీ ఏ కొత్తపల్లి లో రోడ్డు పక్కన ఉన్న తాగునీటి ట్యాంక్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న వినాయకుడి గుడిపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదం ఆదివారం వేకువజామున జరిగింది.

ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చుక్కల శేఖర్ (28), క్లీనర్ కోనూరు నాగేంద్ర (23), తో పాటు గుడిలో నిద్రిస్తున్న స్థానికుడు సోము లక్ష్మణరావు (48) అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శేఖర్, నాగేంద్రలు ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో తొండంగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.
అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు కీలక భేటీ .. ఊపందుకున్న ఊహగానాలు