ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బ్రేకింగ్: కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం – ముగ్గురు మృతి

Share

కాకినాడలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో కొందరు గాయపడ్డారు. కాకినాడ సమీపంలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన జరిగింది. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. విద్యుతాఘాతం కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.

 

గోడౌన్ లో షుగర్ బస్తాలను లోడింగ్ చేస్తుండగా కన్వేయర్ బెల్ట్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే సందర్భంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులు కాకినాడలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Share

Related posts

జగన్ నూతనంగా ప్రారంభించిన వైఎస్ఆర్ తేలే మెడిసిన్

Siva Prasad

బిగ్ బ్రేకింగ్ : పరీక్షల్లో ఫెయిల్ అయి… కరోనా వల్ల తప్పించుకున్న వారికి షాక్

arun kanna

మదనపల్లెలో దారుణం..! దేశం మొత్తం షాక్ కి గురైన ఘటన..!! పోలీసులే నిర్ఘాంతపోయారు..!!

somaraju sharma