ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

చిత్తూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం .. తండ్రీ కొడుకుతో సహా ముగ్గురు సజీవ దహనం

Share

చిత్తూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. చిత్తూరులోని రంగాచారి వీధిలోని పేపర్ ప్లేట్ ల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మూడంస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో భాస్కర్ (65) అనే వ్యక్తి పేపర్ ప్లేట్ ల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. రెండో అంతస్తులో వారు నివసిస్తున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో పేపర్ ప్లేట్ తయారీ యూనిట్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ మంటలు రెండో అంతస్తుకు వ్యాపించాయి. తప్పించుకునే మార్గం లేకపోవడంతో భాస్కర్, ఆయన కుమారుడు ఢిల్లీ బాబు (35), కుమారుడి స్నేహితుడు బాలాజీ (25) ప్రాణాలు కోల్పోయారు.

Fire Accident

 

పేపర్ ప్లేట్ పరిశ్రమ నుండి మంటలు ఎగిసిపడటంతో స్తానికులు అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి భవనాన్ని మంటలు చుట్టేశాయి. ఫైర్ అధికారులు మంటలను అదుపు చేసిన తర్వాత మొదటి అంతస్తు వెళ్లికి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

బాస్కర్ కుమారుడు ఢిల్లీ బాబు సాఫ్ట్ వేర్ ఇంజనీర్. డిల్లీ బాబు మంగళవారం జన్మదినోత్స వేడుకను జరుపుకున్నాడు. డిల్లీ బాబు బర్త్ డే వేడుకల్లో పాల్గొనేందుుక వచ్చిన అతని స్నేహితుడు బాలాజీ రాత్రి అక్కడే ఉన్నారు. ప్రమాదంలో అతను కూడా మరణించాడు. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ యే కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Share

Related posts

బుధవారం ఈ స్తోత్రపారాయణం చేస్తే అన్ని శుభాలే !

Sree matha

Indian Politics ; షర్మిల ఎంటర్ – శశికళ ఎక్జిట్..! ఆ ఒక్క లింకు ఉన్నట్టేనా..!?

Srinivas Manem

ఆ ప్రాంతంలో కనుమరుగైపోతున్న టిడిపి.??

sekhar