Road accident: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ముమ్మడివరం మండలం మహిపాలచెరువు సమీపంలో యానం నుండి ఆముదాలవలస వైపు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది.

దీంతో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా, ఆసుపత్రికి తరలించిన తర్వాత మరో ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు అమలాపురం కు చెందిన దొంగ స్వామి, జే కృష్ణ, రాజేశ్ లు గా గుర్తించారు. అనిల్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.