NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rain Alert: ఏపిలోని ఈ జిల్లాలకు వర్ష హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం

Share

Rain Alert: ఏపిలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. పశువుల కాపరులు, వ్యవసాయ కూలీలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాయువ్య మధ్య ప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకూ కొనసాగుతున్న ధ్రోణి ప్రభావంతో ఇవేళ అక్కడక్కడ ఒ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Thunderstorms likely in coastal districts in Andhra Pradesh

 

రేపు కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవేళ ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు ఉన్నాయని తెలిపింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు పడనున్నాయని, అలాగే మిగిలిన జిల్లాల్లో కొని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉన్నట్లు తెలిపింది.

Breaking: అమృత్ పాల్ సింగ్ అరెస్టు


Share

Related posts

పంతం వీడని రాజాసింగ్.. ప్రమాణానికి దూరం

somaraju sharma

సూర్య గ్రహణం వీటి ద్వారా చూస్తే ఇక అంతే..! తస్మాత్ జాగ్రత్త

arun kanna

Mega Studio: APలో మెగా స్టూడియో.. దానికోసమే చిరు వారిని మళ్లీమళ్లీ కలిశారా?

Ram