తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇవేళ కొన్ని స్పెషల్ దర్శనాలకు సంబంధించి టికెట్లను విడుదల చేయనున్నది. మార్చి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్ల ను టీ టీ డీ అధికారులు నేడు విడుదల చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేయనున్నది. 3వ తేదీ నుండి 7వ తేదీ వరకూ తెప్పోత్సవం జరగనున్నది.

వీటితో పాటు ఏప్రిల్, మే నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణం టోకెన్లను కూడా ఇవేళ మధ్యాహ్నం 2 గంటల నుండి ఆన్ లైన్ లో విడుదల చేయనున్నది టీటీడీ. మార్చి నెలకు సంబంధించి వర్చువల్ సేవా టికెట్లను సైతం ఇవేళ సాయంత్రం నాలుగు గంటలకు టీటీడీ విడుదల చేయనున్నది.
భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్, యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపింది. టికెట్లు బుక్ చేసుకునేందుకు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారి అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్ లో సైన్ అప్ అప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ క్లిక్ చేస్తే.. టికెట్ మొత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. బుకింగ్ ప్రక్రియ సాధారణంగా ఇతర వెబ్ సైట్లలో చేసిన విధంగానే ఉంటుంది. ఒక వేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 57,737 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,090 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న హుండీ కానుకల ద్వారా శ్రీవారికి రూ.3కోట్ల 28 లక్షల ఆదాయం వచ్చింది.
ఏపి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు