NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirumala Srivari Brahmotsavalu 2023: తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు – శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్

Advertisements
Share

Tirumala Srivari Brahmotsavalu 2023: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమైయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మలయప్ప స్వామివారి సమక్షంలో గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. వేదపండితుల మంత్రోత్సారణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisements

రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి వారి దర్శనం అనంతరం సీఎం జగన్ కు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి పెద్ద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు దర్శనం ఇచ్చారు మలయప్ప స్వామి. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి. మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ కోలాహలంగా వాహన సేవ సాగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనాలు అందించారు.

Advertisements

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు జియో ట్యాగు లు వేశారు. బ్రహోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. స్వయంగా ప్రోటోకాల్ ప్రముఖులనే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటి సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని తదితరులు ఉన్నారు.


Share
Advertisements

Related posts

Trivikram : స్పీడ్ పెంచిన త్రివిక్రమ్..??

sekhar

Chandra Babu Delhi Tour: సోమవారం హస్తినకు చంద్రబాబు బృందం..! రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారు..!!

somaraju sharma

Kiss: ముద్దులో ఉండే మరికొన్ని రకాలు తెలుసుకుని వీటిని కూడా ట్రై చేయండి!!

siddhu