NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tirupati By poll : సోము ట్వీట్‌కి అదిరిపోయే రెస్పాన్స్ ..! మీరు చూడండి..!!

Tirupati By poll : తిరుపతి ఉప ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారిణి రత్నప్రభను బీజెపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే, ఆమె దివంగత సీఎం వైఎస్ఆర్ వద్ద పని చేశారనీ, జగన్మోహనరెడ్డి పాలనపై గతంలో ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ లు కూడా చేశారనీ,   వైసీపీ, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలపై రత్నప్రభ సమాధానం కూడా ఇచ్చారు. ఎవరు మంచి పని చేసినా  ప్రశంసించడంలో తప్పేమీలేదని అన్నారు.

Tirupati By poll : ap bjp chief somu tweet
Tirupati By poll ap bjp chief somu tweet

సాధారణంగా రాజకీయాలలో ఉన్న నేతలు ప్రత్యర్థి పార్టీపై, ప్రత్యర్థి పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరుగుతుంటుంది. అయితే ఇదే నాయకులు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలో చేరి ఈ పార్టీ నాయకులను విమర్శించడం సహజమే. రాష్ట్రంలో పార్టీలు మారిన నాయకులు చాలా మందే ఉన్నారు. ఇదే కోవలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పనబాక లక్ష్మి ఆ తరువాత టీడీపీలో చేరి గడచిన ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. ఇప్పుడు మరల రెండవ సారి అదే స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

బీజేపీ అభ్యర్థి రత్నప్రభపై చేసిన విమర్శలకు కౌంటర్ గా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ట్విట్టర్ వేదికగా “నాడు..బాబు గురించి నేటి టీడీపీ తిరుపతి లోక్ సభ అభ్యర్థి పనబాక లక్ష్మి మాటల్లో” అంటూ ఓ వీడియో విడుదల చేశారు.  “తిరుపతి ఎంపి అభ్యర్థి పనబాక లక్ష్మి గారు టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని వర్ణించిన సన్నివేశం మీ కోసం..సమర్పిస్తున్నా” అంటూ సోము వీర్రాజు పేర్కొన్నారు. “అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలియదా,  మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు, ఇప్పుడు ఆయన రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు” అంటూ పనబాక లక్ష్మి అన్న మాటల వీడియోను సోము వీర్రాజు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. సోము వీర్రాజు ట్వీట్ కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కౌంటర్ లు ఇస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే విడతల రజని గతంలో వైసీపీని విమర్శించిన వీడియోను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో బీజెపీని విమర్శించిన  మాటల వీడియోను షేర్ చేస్తూ కామెంట్స్ ఇస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N