Tirupati By Poll; వైసీపీ మీడియాపై టీడీపీ మహిళా నేత అనితకు తీవ్ర కోపం వచ్చింది..! ఎందుకంటే..?

Share

Tirupati By Poll; తిరుపతి ఉప ఎన్నికల Tirupati By election నేపథ్యంలో వైసీపీ YCP, టీడీపీ TDP, బీజేపీ BJP నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఓ పక్క రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపి సిఎం వైఎస్ జగన్మోహన రెడ్డి తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు.

Tirupati By Poll; vangalapudi anitha comments on ycp
Tirupati By Poll; vangalapudi anitha comments on ycp

కాగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న పలువురు టీడీపీ నేతలకు కరోనా సోకిందనీ, వెంటనే వారు హైదరాబాద్ వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మాజీ మంత్రి జవహర్ తదితరులు కరోనా బారిన పడ్డారని కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ట్విట్టర్ వేదికగా అనిత స్పందించారు.

Tirupati By Poll; కరోనా అంటూ అసత్య ప్రచారం…

“నాకు, నా సహచరులకు కరోనా అని నీలి మీడియా, అయిదు రూపాయల చంచాలు ప్రచారం చేస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రమాణం చెయ్యమని ఛాలెంజ్ చేస్తే ప్రచారానికి రాకుండా దాక్కున్న పారాసిటమాల్ చవటాయ్ లాగా కాదు. తగిన జాగ్రత్తలతో ప్రజా క్షేత్రంలోనే ఉంటాం. ప్రజలతోనే ఉంటాము”. అని అనిత ట్వీట్ చేశారు.


Share

Related posts

Nimmagadda Rameshkumar : అంత నిమ్మగడ్డ అనుకున్నట్లే! అధికారులు రిలీవ్!!

Comrade CHE

గ్రేటర్ ఎన్నికల బరి నుండి జనసేన నిష్క్రమణ..! బీజేపీకి మద్దత్తు..!!

Special Bureau

మీకు ఉదయాన్నే ఫోన్ చూసే అలవాటు ఉందా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

Teja