NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Lock Down: దేశంలో లాక్ డౌన్ … అస‌లేం జ‌రుగుతుందంటే..

Lock Down: ఇప్పుడంతా క‌రోనా క‌ల‌క‌లం గురించే చ‌ర్చ‌. ఓ వైపు వ్యాక్సిన్ గురించి ఆలోచ‌న‌లు మ‌రోవైపు పెద్ద ఎత్తున న‌మోదు అవుతున్న కేసులు … భారీ స్థాయిలో మ‌ర‌ణాల‌తో ప్ర‌జ‌లు టెన్ష‌న్‌కు గుర‌వుతున్న ప‌రిస్థితి. ఈ స‌మ‌యంలోనే క‌రోనా సెకండ్ వేవ్ కంట్రోల్ చేయ‌డానికి మ‌రోసారి దేశ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారంటూ వ‌స్తున్న‌వార్త‌లు వైర‌ల్ గా మారిపోయాయి. ఫ‌లానా తేదీ నుంచే లాక్ డౌన్ అన్న టాక్ వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధిస్తార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై కీల‌క క్లారిటీ వ‌చ్చింది.

ఇది ప్ర‌చారం…

కోవిడ్ క‌ట్ట‌డికి కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా.. మ‌రికొన్ని మినీ లాక్‌డౌన్‌, ఇంకా కొన్ని వీకెండ్ లాక్‌డౌన్‌, చాలా రాష్ట్రాలు నైట్ క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించినా.. అది రాష్ట్రాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ బాధ్య‌త మాది కాదు.. కేసుల తీవ్ర‌త‌, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆయా రాష్ట్రాలే నిర్ణ‌యం తీసుకుంటాయ‌ని ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ మే 3వ తేదీ నుంచి 20వ తేదీ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో దీనిపై కేంద్ర స‌మాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ వార్త‌ల‌న్నీ వ‌దంతులేన‌ని స్ప‌ష్టం చేసింది. లాక్‌డౌన్ విధిస్తామ‌ని కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని పీఐబీ క్లారిటీ ఇచ్చింది.

డిల్లీలో మాత్రం లాక్ డౌన్‌…

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు అదుపులోకి రాక‌పోవ‌డంతో మ‌రోసారి లాక్‌డౌన్ పొడిగించారు. కోవిడ్ సెకండ్ వేవ్ క‌ట్ట‌డికి మొద‌ట ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధించిన ఢిల్లీ స‌ర్కార్.. అయినా ప‌రిస్థితి అదుపులోకి రాక‌పోవ‌డంతో మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ఇంకా ప‌రిస్థితిలో ఏ మాత్రం తేడా లేక‌పోవ‌డంతో.. మ‌రో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. దీంతో.. ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఢిల్లీలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉండబోతోంది. కాగా, ఢిల్లీలో తాజాగా 27,000 కొత్త కేసులు న‌మోదు కాగా.. 375 మంది మృతిచెందారు.. ఇలా వ‌రుస‌గా 13వ రోజు 20 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.. దీంతో.. మ‌రోవారం పాటు లాక్‌డౌన్ ఆంక్ష‌లు పొడిగించారు..

author avatar
sridhar

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju