AP CM YS Jagan: జగన్ బెయిల్ రద్దుపై సర్వత్రా ఉత్కంఠ..! నేడే సీబీఐ కోర్టు తీర్పు..!!

Share

AP CM YS Jagan: నేడు నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు కోర్టు తీర్పు వెలువరించనున్నది. దీంతో సామాన్యులు మొదలు కొని రాజకీయ పార్టీల నేతలు దీనిపైనే చర్చించుకుంటున్నారు. జగన్ బెయిల్ రద్దు అవుతుందంటూ జగన్ ప్రత్యర్థులు భావిస్తుండగా, జగన్ శిబిరం మాత్రం ధీమాగా ఉంది.

Today AP CM YS Jagan bail cancelation verdict
Today AP CM YS Jagan bail cancelation verdict

AP CM YS Jagan: కౌంటర్ దాఖలు చేయని సీబీఐ

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై కోర్టు పలు మార్లు విచారణ జరిపింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ నెల రోజుల పాటు కాలయాపన చేసి చివరకు నిర్ణయాన్ని కోర్టుకే వదిలివేసింది. సీబీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. ఈ పరిణామమే జగన్ కు ప్లస్ అవుతుందని కొందరు భావిస్తున్నారు. నేడు కోర్టు తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉంటుందోనని కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే పిటిషన్ దాఖలు చేయాల్సింది సీబీఐ. కానీ సీబీఐ ఈ విషయంలో జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారని గానీ , బెయిల్ రద్దు చేయాలనీ గానీ, అటువంటిది ఏమీ లేదు బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు అని కానీ కోర్టుకు విన్నవించలేదు. ఒక వేళ సీబీఐ జగన్ కు వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసి ఉన్నట్లయితే రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ కు బలం చేకూరేది. అయితే సీబీఐ కోర్టు తీర్పు ఎవరికి ప్రతికూలంగా వచ్చినా వారు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

Read More: Schools Reopen: తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించేందుకు డేట్ ఫిక్స్..!!


Share

Related posts

Workouts: వ్యాయామం సడన్ గా మానేశారా? అయితే ఈ సమస్యలు తప్పవు!!

Naina

విశాఖ గ్యాస్ లీక్ భాదితులు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే ?

Siva Prasad

రూ. 7289 కోట్లతో ఇండియాలో మొదటి బుల్లెట్ ట్రైన్ టెండర్ ఖరారు..!!

Special Bureau