NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Today IMP News: నేటి ముఖ్యమైన వార్తలు ఇవీ

Today IMP News: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వేసవి సెలవులు నేటి నుండి ప్రారంభమైయ్యాయి. నేటి నుండి జూన్ 10వ తేదీ వరకూ వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు జూన్ 13న తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు అయ్యాయి. వెకేషన్ కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ లు, సెలవులు పూర్తి అయ్యే వరకూ వేచి చూడలేని అత్యవసర పిటిషన్ లు మాత్రమే విచారణకు స్వీకరిస్తారు.

  • జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు తొలి సారిగా నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. పెన్నా, సంగం బ్యారేజీలను సందర్శించి పనుల ప్రగతిని పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
  • శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నేడు వైఎస్ఆర్ సీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు, ఇన్ చార్జి మంత్రులు ఎమ్మెల్యేలు హజరు కానున్నారు.
  • సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్ధిని తేజస్వీని మృతిపై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు గుంటూరు మంగళగిరి డీజీపీ కార్యాలయానికి బిజేపీ నేతల బృందం చేరుకుని డీజీపీకి వినతిపత్రం సమర్పించనున్నారు.
  • శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు జిల్లా అభివృద్ధి మండలి (డీఆర్ సీ) సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు సీదిరి అప్పరాజు, ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారామ్ పాల్గొంటారు.
  • కర్నూలు జిల్లా పత్తికొండలో జిల్లా అధికారులతో నేడు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి లు సమీక్ష
    జరపనున్నారు.
  • రాష్ట్రంలో పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ నేడు వామపక్షాలు ఏపి సచివాలయ ముట్టడికి పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు యంత్రాంగం అప్రమత్తమై వివిధ జిల్లాల్లో సీపీఐ, సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు చేశారు.
  • సుప్రీంకోర్టులో ఈ రోజు ఇద్దరు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం జరుగుతోంది. జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జేబీ పర్దీవాలాలతో సిజేఐ జస్టిస్ ఎన్ వి రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
  • ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ వ్యూహాలు, కార్యాచరణపై చర్చ జరిపి పలు కీలక అంశాలపై తీర్మానాల ముసాయిదాలు సిద్ధం చేయనున్నారు. తీర్మానాలపై నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో చర్చ జరపనున్నారు.
  • రష్యాలో నేడు విక్టరీ డే ఉత్సవాలు జరుపుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమికి గుర్తుగా ఈ విక్టరీ డే ఉత్సవాలు జరుపుకోవడం తెలిసిందే.
  • నేడు డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరుగుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N