NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టెక్నాలజీ న్యూస్ రాజ‌కీయాలు

Toll Plaza : గుడ్ న్యూస్ః టోల్ గేట్లు అన్నీ ఎత్తేస్తున్నారోచ్‌….

Toll Plaza :ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌. టోల్ గేట్లు అన్ని ఎత్తేస్తున్నారు. ఇది వ‌చ్చే ఏడాది నుంచి అమ‌లు కానుంది. కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ ప్లాజాలు తొలగిస్తామని కేంద్రం రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అదే స‌మ‌యంలో వీటి స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను తీసుకువస్తామని స్పష్టం చేశారు.

Toll Plaza
Toll Plaza

Toll Plaza టోల్ గేట్లు ఉండ‌విక‌…

ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ బూత్‌లను తొలగిస్తామని లోక్‌సభలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 93 శాతం వాహనదారులు ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ చెల్లింపులు చేస్తున్నారని గడ్కరీ ఈ సందర్భంగా వెల్లడించారు. మిగతా 7 శాతం మంది మాత్రం రెట్టింపు టోల్ వసూలు చేస్తున్నా ఫాస్టాగ్‌ ఉపయోగించడం లేదని అన్నారు. ఫాస్టాగ్‌ ద్వారా టోల్ చెల్లించని వాహనాలపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్టు నితిన్ గడ్కరీ వెల్లడించారు.

ఫాస్టాగ్ ఇలా ….

టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించాలనే ఉద్దేశ్యంతో ఫాస్టాగ్ విధానాన్ని 2017 నుంచి కేంద్రం అమలు చేస్తుండగా.. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా.. ఈ విధానాన్ని తప్పనిసరి చేసింది. ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు.. పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు వచ్చింది.ఫాస్టాగ్ విధానంలో వాహనాల విండ్‌స్క్రీన్‌పై ఉంచే ఫాస్టాగ్ స్టిక్కర్ లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు.

ఇది టోల్ ప్లాజాలోని స్కానర్‌కు నేరుగా కనెక్ట్ అవుతుంది. వాహనదారుల ఖాతా నుంచి డబ్బులు ఆటోమెటిగ్గా కట్ అవుతాయి. ఇప్పటికే ఫాస్టాగ్ లేని వాహనాలను మార్షల్ లైన్‌లోకి అనుమతించడం లేదు. జనవరి 1 నుంచి ఆ ట్యాగ్ లేకుండా అసలు ఏ లైన్‌లోకి రాకుండా క‌ల్పించారు. వీటితో పాటు పాజిటివ్‌ పే సిస్టమ్‌, కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీల పెంపు, జీఎస్టీ రిటర్న్స్‌ వంటి నిబంధనలు అమల్లోకి వ‌చ్చాయి.

author avatar
sridhar

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!