NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

టోటల్ మెలిక పెట్టిన వై ఎస్ జగన్ – నిమ్మగడ్డ వెనకడుగు – వైసీపీ ఘనవిజయం ?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా దూకుడుగా వ్యవహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. మరో పక్క ఉద్యోగ సంఘాలు ఎన్నికలను నిర్వహించలేమని అంటున్నారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎన్నికలను వ్యతిరేకిస్తున్నా ఎస్ఈసీ నిమ్మగడ్డ మాత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికలకు సహకరించకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా ఉద్యోగులకు నిమ్మగడ్డ హెచ్చరికలు జారీ చేశారు. సుప్రీం కోర్టు నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పుఎం ఇచ్చింది. కాకపోతే నోటిఫికేషన్ సమయంలో నిమ్మగడ్డ చెప్పిన ఆసక్తికరమైన విషయాలే ఎన్నికలకు బ్రేక్ పడేలా చేస్తాయని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలోని 3 లక్షల మంది కొత్త ఓటర్ల రూపంలో కొన్ని చిక్కులు రాబోతున్నాయి.

వాస్తవానికి 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలకు వెళ్లాల్సి ఉందని నిమ్మగడ్డ స్వయంగా చెప్పారు.. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఓటర్ల జాబితా ఇవ్వడంలో విఫలం అవ్వడం వల్ల, ఎన్నికల సంఘానికి సహకరించకపోవడం కారణంగా 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అలా చెప్పడం వరకూ బాగానే ఉంది కానీ అదే సమయంలో పాత జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించడం వల్ల దాదాపు 3.6 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయారని కూడా చెప్పారు నిమ్మగడ్డ. ఇప్పుడు ఇదే పాయింట్ అధికార పార్టీకి అస్త్రంగా మారింది. కొందరు ఇప్పటికే ఈ అంశాన్ని ఉదహరిస్తూ ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ నూ దాఖలు చేశారు. నిమ్మగడ్డ చెప్పిన ఈ అంశమే ఇప్పుడు ఎన్నికలకు బ్రేక్ వేసేందుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహణ.. నోటిఫికేషన్ అంశాలే చూసిన కోర్టులకు ఇప్పుడు కొత్త ఓటర్ల రూపంలో మెలిక వచ్చింది.

ప్రభుత్వానికి, ఎన్నికల సంఘంకు మద్య ఏర్పడిన వివాదం కారణంగా తామెందుకు ఓటు హక్కు కోల్పోవాలని పేర్కొంటూ పిటిషన్ లు దాఖలు చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. సోమవారం ఓ న్యాయవాది కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లు హైకోర్టులో బుధవారం విచారణకు రానున్నాయి. మరో పక్క ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కొరవడిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర సిబ్బందిని కేటాయించాలని కోరారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!