Tragedy: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. విద్యుతాఘాతంతో ఇద్దరు అన్నతమ్ములు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికి అందివచ్చిన ఇద్దరు కుమారులు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. వెవులపల్లి గ్రామానికి చెందిన అన్నతమ్ములు వల్లేపల్లి నాగేంద్ర (21), వల్లేపల్లి ఫణీంద్ర (19) పాలు తీసుకువచ్చేందుకు బైక్ పై పొలం వద్దకు వెళుతుండగా, మార్గమధ్యలో వీరి బైక్ పై 11 కేవి విద్యుత్ వైర్ తెగి పడింది. దీంతో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో బైక్ పై ఉన్న ఇద్దరు అన్నతమ్ములు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు.
మృతుల్లో నాగేంద్ర ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, ఫణీంద్ర ఇంటర్ పూర్తి చేశారు. చేతికి అందివచ్చిన కుమారులు ఇద్దరూ విద్యుతాఘాతంతో అసువులు బాయటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే పోలీస్, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణమైన అధికారులపై చరయ్లు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…