Tragedy: ఓ మహిళ భర్త, పిల్లలను వదిలివేసి వెళ్లిపోయింది..! ఆ తరువాత ఆ ఇంట్లో తీవ్ర విషాదం..! ఏమి జరిగిందంటే..?

Share

Tragedy: క్షణికావేశంతో కొందరు ఇటీవల బలన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతున్నారు. వారి అనాలోచిత చర్యల కారణంగా అభం శుభం తెలియని చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాధలు అవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ ఘటన చూపరుల హృదయాలను కలచివేసింది. ఓ మహిళ కుటుంబ కలహాల కారణంగా భర్త, పిల్లలను వదిలివేసి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా, మరో బాలిక మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం మోదుగులపాళెం గ్రామంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన మేర్లపాక మురళి (40) భార్య కుటుంబ కలహాల నేపథ్యంలో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మురళి తల్లి మస్తానమ్మ (60), కుమార్తె కావ్యశ్రీ(11)కి విషమిచ్చి ఆపై తాను తాగాడు. ఇది గమనించిన స్థానికులు మురళి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే మస్తానమ్మ మృతి చెందింది. మురళి, కావ్యశ్రీని హుటాహుటిన సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురళి మృతి చెందాడు. కావ్యశ్రీ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

వీరి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే మురళి కుమారుడు లోకేష్ ఆచూకీ లభించలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో పిల్లలు అనాధలుగా మారే పరిస్థితి ఏర్పడింది. కావ్యశ్రీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా ఆమె సోదరుడు లోకేష్ ఎక్కడ ఉన్నాడో తెలియలేదు.

Read More: YSRCP: టీడీపీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరుతున్న మరో మాజీ మంత్రి..! ఎవరంటే..?

 


Share

Related posts

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబు హీరోగా “క్యాలీఫ్లవర్”..!!

bharani jella

రామోజీ, రాధాకృష్ణ ఓ వైపు… విజ‌యసాయిరెడ్డి ఓ వైపు..

sridhar

Breaking : కేంద్రం కీలక నిర్ణయం.. ఏప్రిల్ 1 నుండి 45ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్..

somaraju sharma