ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సత్తెనపల్లిలో విషాదం .. ముగ్గురు మృతి

Share

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘోర విషాద ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్ యజమాని తో పాటు మరో ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి దుర్మరణం పాలైయ్యారు. వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లి బస్టాండ్ సమీపంలోని ఓ రెస్టారెంట్ డ్రైనేజీ శుభ్రం చేసేందుకు ఇద్దరు కూలీలను పిలిపించారు. మ్యాన్ హోల్ లోకి దిగిన ఇద్దరు కూలీలు ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో రెస్టారెంట్ భవన యజమాని కొండలరావు కూడా అందులోకి దిగాడు.

 

ఇలా మ్యాన్ హోల్ లోకి దిగిన ముగ్గురు బయటకు రాకపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి ముగ్గురు డ్రైనేజీలో మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని డ్రైనేజీలో నుండి ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Share

Related posts

Romance: ఏ  సమయాల్లో శృంగారాన్ని బాగా ఆస్వాదించగలరో తెలుసుకోండి!!

siddhu

షాక్ ఇచ్చిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో అమీర్ ఖాన్ ..?

GRK

మోడీకి షాకివ్వాల‌ని కేసీఆర్ అనుకుంటే నడిరోడ్డుపై ప‌రువు తీసేసిన టీఆర్ఎస్ నేతలు

sridhar