Tragedy: కృష్ణాలో విషాదం..చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి

Share

Tragedy: కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఈదరకు సమీపంలోని శోభనాపురం చెరువులో గుర్తించారు. నిన్న ఆడుకునేందుకు బయటకు వెళ్లిన జగదీశ్ (8), చంద్రిక (9),  శశిత (11) కనిపించకుండా పోయారు. పిల్లల తల్లిదండ్రులు వారి కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tragedy: three children drowned in water
Tragedy: three children drowned in water

ఈదర సమీపంలోని శోభనాపురం చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను ఈ రోజు పోలీసులు గుర్తించారు. చిన్నారులు అదృశ్యం కావడంతో ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని చిన్నారుల తల్లిదండ్రులు భావించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.


Share

Related posts

జ‌గ‌న్‌లో భ‌యం…. ఆ ఇద్ద‌రు నేత‌ల ప‌నులే కార‌ణం?!

sridhar

అమరావతి ఉద్యమానికి సిపిఐ మద్దతు

somaraju sharma

Today Gold Rate : దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు..!!

bharani jella