Badvel Bypoll: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల నడుమ దివంగత ఎమ్మెల్యే సతీమణి..! బద్వేల్ బైపోల్‌లో త్రిముఖ పోరు..!!

Share

Badvel Bypoll: ప్రధాన రాజకీయాల్లో ఒకటైన టీడీపీతో సహా జనసేన పోటీ నుండి తప్పుకోవడంతో కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక వైసీపీకి ఏకగ్రీవం అవుతుందని అందరూ భావించారు. వైసీపీ కూడా  సంప్రదాయాన్ని అనుసరించి ఏకగ్రీవానికి ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తాయని భావించింది. ఆ క్రమంలోనే దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధను వైసీపీ అభ్యర్థిగా నిలిపింది. దీంతో దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి సుధకు వైసీపీ టికెట్ ఇచ్చి నందున మానవతా దృక్పదంతో తమ పార్టీ నుండి అభ్యర్థిని పోటీకి నిలపడం లేదని పేర్కొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించుకోవాలని సూచించారు. జనసేన తప్పుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దీనిపై పునరాలోచన చేశారు. అంతకు ముందు టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ ను ప్రకటించినప్పటికీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేతలు రాజశేఖర్ కు చెప్పి ఒప్పించారు.

Traiangular contest in Badvel Bypoll
Traiangular contest in Badvel Bypoll

Badvel Bypoll: బీజేపీ అభ్యర్థిగా జయరాములు..?

అయితే జనసేన పోటీ నుండి తప్పుకున్నా తాము మాత్రం పార్టీ అభ్యర్థిని పోటీకి నిలుపుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యే పిఎమ్ కమలమ్మను అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. బీజేపీ నుండి కూడా మాజీ ఎమ్మెల్యే జయరాములును బరిలో నిలుపుతున్నారు. ఆయన అభ్యర్థిత్వం నేడో రేపో ఖరారు చేయనున్నారు. నామినేషన్ల దాఖలునకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు వారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి దాసరి సుధ నామినేషన్ దాఖలు చేసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈజీగా ఏకగ్రీవం అవుతుందని భావించిన వైసీపీకి బీజేపీ, కాంగ్రెస్ షాక్ ఇచ్చినట్లు అయ్యింది. బద్వేల్ ఉప ఎన్నికకు ఏకగ్రీవం అవకాశం లేకుండా పోయింది.

ముగ్గురూ విద్యాధికులే

బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తున్న జయరాములు 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం జయరాములు టీడీపీలో చేరిపోయారు. గడచిన ఎన్నికలకు ముందు జయరాములు బీజేపీలో చేరారు. మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన జయరాములు 2014 ఎన్నికలకు ముందు స్వచ్చంద పదవీ విరమణ చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం అయిన బద్వేల్ నుండి పోటీలో ఉంటున్న ముగ్గురు అభ్యర్థులు విద్యాధికులే. వైసీపీ తరపున అభ్యర్థిగా ఉన్న దాసరి సుధ వైద్యురాలు కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిఎమ్ కమలమ్మ మూడు దశాబ్దాల పాటు అధ్యాపకురాలిగా పని చేశారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: అఖిల్ చేసిన కామెంట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు..!!

sekhar

Elections : ముఖ్యమంత్రి పైనే పోటీ చేస్తున్న దళిత మహిళ..! ఆమెకు జరిగిన అన్యాయం తెలిస్తే కన్నీరే

siddhu

చంద్రన్నకు చిర్రెత్తింది

somaraju sharma