ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Transco Employees Protest: జీతాలు సక్రమంగా చెల్లించాలంటూ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

Share

Transco Employees Protest: విద్యుత్ రంగ సంస్థలైన జెన్‌కో, ట్రాన్స్ కో, డిస్కంలలో పని చేస్తున్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయా ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ నెలలో 8వ తేదీన జీతాలు జమ అయ్యాయి. ఈ నెల 12వ తేదీ వచ్చినా విద్యుత్ శాఖ ఉద్యోగులకు జీతాల చెల్లింపు జరగలేదు. వేతనాలపై ఆధారపడిన విద్యుత్ శాఖ ఉద్యోగులు కొందరు వివిధ రకాల లోన్లు బ్యాంకుల నుండి తీసుకుని ఉన్నారు. జీతాలు సక్రమంగా పడకపోవడంతో చెక్ లు బౌన్స్ అవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు ఆలస్యం కావడంతో ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజుల చెల్లింపునకు జాప్యం అవుతోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Transco Employees Protest for salaries
Transco Employees Protest for salaries

Transco Employees Protest: ఉద్యోగుల నిరసన

జీతాలు సక్రమంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించగా, బాపట్ల జిల్లా చీరాలలో విద్యుత్ ఉద్యోగులు మద్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏపిసిపిడీసిఎల్ అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చీరల విద్యుత్ ఏఇ మాట్లాడుతూ 12వ తేదీ వచ్చినా ఇంత వరకూ జీతాలు చెల్లింపు జరగలేదనీ, దీంతో పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. యాజమాన్యం తక్షణం స్పందించి ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.


Share

Related posts

వామ్మో !కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ‘తేడాగాళ్లు’ అవుతారట!కొత్త భయం రేపిన ఎమ్మెల్సీ!

Yandamuri

బ్రేకింగ్ : కరోనా సంక్షోభంలో జగన్ డేరింగ్ స్టెప్..! వీరితో ఒప్పందం మహా మేలు

arun kanna

పద్మారావు వ్యాఖ్యలతో తెలంగాణ పిక్చర్ క్లియర్!కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టడమే తరువాయి!

Yandamuri