NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TRS: ధాన్యం రగడ ..! కేంద్రంపై ఒత్తిడికి కేసిఆర్ వ్యూహం షురూ..!!

TRS: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశం హీట్ పుట్టిస్తూనే ఉంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన గళం వినిపించారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ సమావేశాలను బహిష్కరించి వచ్చేశారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై అమీతుమీ తేల్చుకునేందుకు కేసిఆర్ సిద్ధమైయ్యారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రైతు బంధు, దళిత బంధు కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్న కేసిఆర్.. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేసిఆర్ సూచనల మేరకు శనివారం టీఆర్ఎస్ మంత్రులు, పార్లమెంట్ సభ్యుల బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ బృందంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరరావు, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావుతో పాటు పార్టీ ఎంపీలు ఉన్నారు.

TRS govt war for paddy procurement
TRS govt war for paddy procurement

 

TRS: రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

వానాకాలంలో అదనపు కోటా ధాన్యం కొనుగోలు చేయాలని వారు కేంద్రంపై ఒత్తడి చేయనున్నారు. ఆది, సోమవారాల్లో కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి మోడీ తో భేటీకి ఈ బృందం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పీఎం, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ లు కోరారు. ఖరీఫ్ సీజన్ లో సీజన్ లో పండే వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని స్పష్టత కోరనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ముంబాయిలో ఉన్నారు. రేపు ఆయన ఢిల్లీకి రానున్నారు. రేపు ఆయన ఢిల్లీకి వచ్చిన వెంటనే తెలంగాణ మంత్రులు, ఎంపీలు కలవనున్నారు. మరో పక్క 20వ తేదీ సోమవారం కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కేసిఆర్ పిలుపు ఇచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju