NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తిరుమలలో డ్రోన్ విజ్యువల్స్ కలకలం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..?

తిరుమల ఆలయాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. హైదరాబాద్ కు చెందిన సంస్థ సోషల్ మీడియాలో డ్రోన్ విజ్యువల్స్ ప్రసారం చేసినట్లుగా గుర్తించామనీ, సదరు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్ తో చిత్రీకరించే అవకాశం లేదని అన్నారు. అయితే పాత చిత్రంతో యూనిమేట్ చేశారా అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డ్రోన్ చిత్రాలు, దృశ్యాలపై భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదని చైర్మన్ వైవీ విజ్ఞప్తి చేశారు.

YV Subba Reddy

 

ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదనే నిబంధన ఉంది. బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి పశ్చిమ మాడవీధి వరకు దృశ్యాలు చిత్రీకరించారు. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా చిత్రీకరణ చేశారు. నో ఫ్లై జోన్ గా ఉన్న తిరుమల లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ అంశాన్ని టీటీడీ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు.

డ్రోన్ రైడర్ 1 అనే యూట్యూబ్ ఛానెల్ లో గత ఏడాది నవంబర్ 13న వీడియోను అప్ లోడ్ చేసినట్లుగా ఉండగా, అదే వీడియోను ఐకాన్ ఫాక్ట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో ఈ నెల ఏడవ తేదీన పోస్ట్ అయినట్లు కనబడుతోంది. అదే వీడియోను గృహ శ్రీనివాస అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశారు.

డ్రోన్ లు ఎవరు ఎగురవేశారు అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఆస్థాన మండపం సమీపంలోని రోడ్లపై నుండి రెండు నెలల క్రితం డ్రోన్లను ఎగురవేసిన దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు. కాకులకోన వద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వీడియోలు తీసేందుకు డ్రోన్ ఆపరేటర్లు అక్కడకు వచ్చినట్లు గుర్తించారు. మూడు నెలల ముందు సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వీడియోలను డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీ అనుమతించింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ డ్రోన్ దృశ్యాలను డ్రోన్ ఆపరేటర్ లు చిత్రీకరించారు. దీంతో డ్రోన్లను ఎవరు ఎగురవేశారనే విషయంపై వెలుగులోకి వచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju