TTD: తిరుమల ఆలయంపై హెలికాఫ్టర్లు చెక్కర్లు కొట్టడం తీవ కలకలం రేపింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమల ఆలయంపై చెక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్లు మిలిటరీదని తెలిసిందని అన్నారు. దేశ భద్రత వి,యంలో మనం జోక్యం చేసుకోలేమని ఆయన చెప్పారు. గురువారం ఉదయం టీటీడీ ఉద్యోగుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంలో చైర్మన్ సుబ్బారెడ్డి .. కార్మికుల ఆందోళనపైనా మాట్లాడారు. సులభ కార్మికులు ఆకస్మికంగా విధులను బహిష్కరించి భక్తులను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. మొదట విధులకు హజరై ఆ తర్వాత వారి డిమాండ్ల అడిగితే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో పక్క నకిలీ వెబ్ సైట్లు, బ్లాక్ లో దర్శనం టికెట్ల కు కారణం అవుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఈ నెల 25వ తేదీన తిరుమల కొండపై మూడు హెలికాఫ్టర్ లు చెక్కర్లు కొట్టిన విషయం తీవ్ర కలకలాన్ని రేపింది. నోఫ్లైజోన్ లో తిరుమల కొండపై ఇంతకు ముందు పలు మార్లు హెలికాఫ్టర్ లు చెక్కర్లు కొట్టడం, వివాదం అయిన సంగతి తెలిసిందే.
Rain Alert: ఏపిలో మరో వారం రోజులు వర్షాలు .. ఏయే ప్రాంతాల్లో అంటే..?