NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TV9 Ravi Prakash: కేసీఆర్ బాధితుడు.. బీజేపీ వంచితుడు.. మళ్ళీ మరో ఛానెల్ అంట!!

TV9 Ravi Prakash: దాదాపు 2 దశాబ్దాల క్రితం మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన TV9 రవిప్రకాశ్ సుపరిచితులే. TV9 ఫౌండర్-చైర్మన్ గా ఆ చానెల్ ను వార్తా ప్రసారాల్లో అగ్రగామిగా నిలిపారు. తెలుగులో తొలి 24/7 వార్తా చానెల్ గా tv9 ఇంటింటికీ చేరువైన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే తెలుగులో వార్తా చానెల్స్ విస్తృతి పెరిగింది. నిరంతర వార్తా స్రవంతితో రవిప్రకాశ్ వేసిన బాట.. చానెల్ ను అభివృద్ధి పధంలో నడిపిన తీరుతో tv9 పేరు ప్రఖ్యాతులు ఓదశలో దేశవ్యాప్తంగా మారుమోగాయనే చెప్పాలి. ప్రస్తుతం రవిప్రకాశ్ tv9 నుంచి వేరుపడి కొత్తగా చానెల్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

tv9 ravi prakash new step
tv9 ravi prakash new step

సరికొత్తగా.. వినూత్నంగా..

నాటకీయ పరిణామాల మధ్య ఆయన tv9 కు కొన్నాళ్లుగా దూరంగా ఉన్నారు. ఆయన కొత్తగా చానెల్ ఏర్పాటు చేస్తారని అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆయన ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు, ప్రింట్ మీడియా రంగంలోనూ అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు రవిప్రకాశ్ బృందం పెద్ద కసరత్తే చేసిందని తెలుస్తోంది. ఏకంగా ఒకేసారి ఏడు భారతీయ భాషల్లో మీడియా చానెల్స్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ, సరికొత్త ఎక్విప్ మెంట్, ఫీచర్స్.. వంటి మార్పులతో మీడియాలోకి పునరాగమనం చేసేందుకు రవిప్రకాశ్ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ప్రమోటర్ల సాయంతో..

ఇందుకు రవిప్రకాశ్ కు మిడిల్ ఈస్ట్ సావరిన్ ఫండ్ తోపాటు సిలికాన్ వ్యాలీ మీడియా టెక్నాలజీ ఈక్విటీ సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ఫిబ్రవరి నెలలోనే రవిప్రకాశ్ నుంచి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే ప్రసారాలు కూడా ప్రారంభించాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రవిప్రకాశ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. Tv9 తో సంచలనాలు నమోదు చేసిన రవిప్రకాశ్ మీడియాకు పాతే అయినా.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వార్తా ప్రసారాల సంస్థతో మరెన్ని వండర్స్ సృష్టిస్తారో చూడాల్సి ఉంది.

స్వశక్తిని నమ్ముకోవాలనే..

టీవీ9 నుంచి 8శాతం వాటాతో బయటకొచ్చిన తర్వాత రవిప్రకాశ్ రాజ్ న్యూస్ చానెల్ లోకి వెళ్లారు. టీఆరెస్ కి వ్యతిరేకంగా బీజేపీ ప్రారంభించిన చానెల్ అది. అక్కడా రవిప్రకాశ్ కి కలిసి రాలేదు. టీవీ9 లో తన నిష్క్రమణకు కారణమైన టీఆర్ఎస్ (పుకారు) కు వ్యతిరేక పార్టీ కాబట్టి.. సీఎం కేసీఆర్ పై మీడియా ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. అయితే.. రెండు నెలల్లోనే బీజేపీ పెట్టిన పొగలో ఉక్కిరిబిక్కిరై బయటకు వచ్చేశారు. టీఆరెస్ – బీజేపీ అంతర్గత ఒప్పందాలతో ఆయన్ను చానెల్ లో ఉండనివ్వలేదనే వాదనా ఉంది. దీంతో ఇప్పుడు అక్కడా.. ఇక్కడా కాకుండా కొందరు ప్రమోటర్లతో తానే సొంతంగా చానెల్ నడిపేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

 

author avatar
Muraliak

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju