NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

YSRCP Again 2024: ట్విట్టర్ ను షేక్ చేస్తున్న వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా సైన్యం

Share

YSRCP Again 2024: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #YSRCPAgain2024 పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసింది. ఈ ట్యాగ్ క్రియేట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్ లోకి వెళ్లింది. జాతీయ స్థాయిలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఈ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.

CM YS Jagan

నాలుగు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, రాజకీయంగా సాధించిన విజయాలు తదితర అంశాలను వైఎస్ఆర్ సీపీ అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సీఎంగా వైఎస్ జగన్మోహనరెడ్డి సామాన్య ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు వస్తున్న ఆదరణ తదితర అంశాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏపి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివిధ రాష్ట్రాలు స్పూర్తిగా తీసుకున్న విషయాలను వైసీపీ సోషల్ మీడియా సైన్యం పోస్టు చేస్తున్నాయి.

YSRCP

#YSRCPAgain2024 హ్యాష్ ట్యాగ్ కేవలం పది నిమిషాల వ్యవధిలో ట్రెండింగ్ లోకి రావడం, జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడంపై వైఎస్ఆర్  సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న ట్వీట్లలో ఆకట్టుకుంటున్నవాటిని కార్యకర్తలు సేకరిస్తున్నారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా వింగ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో దూకుడుగా వ్యవహరిస్తొంది. గత ఏడాది సీఎం వైఎస్ జన్మదినం సందర్భంగా జరిగిన ట్రెండింగ్ లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.


Share

Related posts

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు

somaraju sharma

Ladies: లెగిన్స్ వేసుకుంటున్నారా?అయితే ఇది మీకోసమే!!

siddhu

గుడ్ న్యూస్ః రైతుల‌కు ఇక నెలా నెలా పెన్ష‌న్‌

sridhar