Sileru river: విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సీలేరు నదిలో రెండు నాటు పడవలు ప్రమాదానికి గురైయ్యాయి. పడవలు మునగడంతో ఎనిమిది మంది గల్లంతు కాగా వారిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం నుండి బయటపడి ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. రెండు పడవల్లో 11 మంది ప్రయాణీకులు ఉన్నారు.

అందరూ వలస కూలీలుగా తెలుస్తోంది. ఒడిశా నుండి హైదరాబాదు కూలీ పనులకు వెళ్లిన వీరు లాక్ డౌన్ వల్ల తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా మల్కాన్ గిరి జిల్లా కెందుగూడ, గుంటవాడ గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
