NewOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: విజయవాడ బాణాసంచా దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం .. ఇద్దరు సజీవ దహనం

Share

Breaking: దీపావళి పండుగ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడ లోని జింఖానా గ్రౌండ్స్ లో బాణా సంచా దుకాణాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఈ మైదానంలోనే బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ మైదానంలో ఏర్పాటు చేసిన దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణాలకు వచ్చిన బాణాసంచా దిగుమతి చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు మృతులు ఇద్దరు బ్రహ్మ, కాశీలు బాణాసంచా దుకాణంలో పని చేసే కార్మికులుగా భావిస్తున్నారు.

Fire Accident

 

ఈ అగ్ని ప్రమాదం కారణంగా 15,16,17 నెంబర్ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. 18 నెంబర్ దుకాణం పాక్షికంగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే నాలుగు అగ్ని మాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. బాణాసంచా దుకాణాల్లో జరిగిన ఈ ప్రమాదంతో భారీ పేలుడు శబ్దాలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. సకాలంలో మంటలను అదుపు చేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. కాస్త ఆలస్యమైనా మైదానంలోని 20 దుకాణాలు దగ్దమయ్యే వని స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisements

Munugode Bypoll: వాహనాల తనిఖీల్లో మరో కోటి నగదు పట్టివేత.. ఈ నగదు ఆ నేతకు సంబంధించనవే..?

Fire Accident

Share

Related posts

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో నిందితులకు బెయిల్ మంజూరు

somaraju sharma

West Bengal : పశ్చిమ బెంగాల్ సీఎం దీదీకి గాయాలు.. కోల్‌కతా ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలింపు

somaraju sharma

బాబుకు సౌండ్ లేకుండా చేసిన మహిళా బాంబు ఎవరు!

Yandamuri