NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపికి రానున్న ఇద్దరు కేంద్ర మంత్రులు .. తెలంగాణలో మాదిరిగా అధికార పార్టీతో మాటల యుద్దం తప్పదా..?

తెలంగాణలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే పర్యటించారు. అధికార టీఎస్ఆర్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర మంత్రుల వ్యాఖ్యలకు టీఆర్ఎస్ మంత్రులు కౌంటర్ల తో టీఆర్ఎస్, బీజేపీ నేతల మాటల యుద్దం జరుగుతోంది. ఆ వ్యవహారం కొనసాగుతున్న క్రమంలోనే ఇద్దరు కేంద్ర మంత్రులు ఏపి పర్యటనకు విచ్చేస్తున్నారు. ఈ నెల 10,11 తేదీల్లో సామాజిక న్యాయం, సాధికారత శాఖ కేంద్ర మంత్రి నారాయణ స్వామి విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించనుండగా, అదే తేదీల్లో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతీ పవార్ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు.

Union Ministers AP Tour

బెంగళూరును అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. చెరువులను తలపిస్తున్న రహదారులు .. భారీగా ట్రాఫిక్ జామ్ ..ఇదిగో వీడియో

ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును వీరు పరిశీలించనున్నారు. సామాన్య కార్యకర్త ఇళ్లలో ఈ కేంద్ర మంత్రులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. మండల స్థాయిలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే అంశాలపై వీరు సమీక్ష చేయనున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశగానే కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. చాలా కాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా నేతలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్కిక్కర్ లు వేసుకుని తమ ప్రభుత్వ ఘటనగా చెప్పుకుంటోందని విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై తెలంగాణలో కేంద్ర మంత్రులు ప్రస్తావించారు. రేషన్ పంపిణీలో అత్యధిక ఖర్చు కేంద్రం భరిస్తుంటే.. రేషన్ దుకాణాల్లో ప్రధాన మంత్రి ఫోటో ఎందుకు పెట్టలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించగా, వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో పీఎం ఫోటో ఎందుకు లేదంటూ మరో కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే ప్రశ్నించారు. ఈ విమర్శలపై టీఆర్ఎస్ నేతలు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు.

ఇక ఏపిలో పర్యటించనున్న కేంద్ర మంత్రులు కూడా వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ సర్కార్ పై కేంద్ర మంత్రులు విమర్శలు ఎక్కుపెడితే .. వైసీపీ నేతలు అదే ధీటుగా ప్రతి విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే ఏపి విషయానికి వస్తే కేంద్రంలోని పెద్దలు కొంత సాఫ్ట్ కార్నర్ లోనే ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. తెలంగాణలోని కేసిఆర్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరించే కేంద్రం .. ఏపి విషయంలో కొంత సానుకూల ధోరణినే ప్రదర్శిస్తొంది. ఏపి పర్యటనకు విచ్చేసిన పలువురు కేంద్ర మంత్రులు ఇంతకు ముందు ఏపిలోని పలు పథకాల అమలుతీరును ప్రశంసించారు. రాజకీయ పరమైన మీటింగ్ లలో మాత్రమే కేంద్ర మంత్రులు అధికార వైసీపీపై విమర్శలు చేస్తున్నారే కానీ అధికారిక కార్యక్రమాలకు విచ్చేసిన సందర్భాల్లో విమర్శల జోలికి వెళ్లడం లేదు. అయితే ఇప్పుడు రానున్న కేంద్ర మంత్రులు ఏపి ప్రభుత్వ విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.

సంఘ నేతల బహిష్కరణ పిలుపు బుట్టదాఖలు .. సీఎం జగన్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!