NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నెల్లూరు లో విషాదం .. గుంతలో పడిన పిల్లలను కాపాడి ఇద్దరు తల్లులు మృతి

Advertisements
Share

నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంతలో పడిన ఇద్దరు పిల్లలను రక్షించబోయి తల్లులు షాహినా, షబీనా మృతి చెందడం స్థానికులను కలచివేసింది. విషయంలోకి వెళితే.. పెన్నానది రివిట్ మెంట్ వాల్ నిర్మాణం కోసం ఇటీవల గుంతలు తవ్వారు. బుధవారం సాయంత్రం అటుగా వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయారు. ఆ ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు వారి తల్లులు షాహినా, షబీనా గుంతలోకి దూకారు. చిన్నారులను కాపాడిన తర్వాత వారిద్దరూ గుంతలో నుండి పైకి రాలేకపోయారు. బురదలో చిక్కుకుపోయి ప్రాణాలు వదిలారు.

Advertisements

 

ఈ ఘటనతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా రివిట్ మెంట్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయనీ, జేసీబీతో గుంతలు తవ్వి వదిలివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ గుంతల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని అంటున్నారు. నిర్మాణంలో జాప్యం కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు.

Advertisements

నెల్లూరు లో భర్త, చెన్నై ఆసుపత్రిలో భార్య .. ఒకే రోజు ఇద్దరూ మృతి


Share
Advertisements

Related posts

Devisriprasad: పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా కాంప్రైజ్ కానంటున్న దేవిశ్రీప్రసాద్..అనవసరంగా మిస్ చేసుకుంటాడా..?

GRK

Job Notification : ఎన్ఎండీసీ లో భారీగా ఖాళీలు..!!

bharani jella

మోడీ సర్కార్ పై ఉర్జిత్ బాంబ్

Siva Prasad