NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి త‌ల‌నొప్పులు మామూలుగా లేవ‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక్క‌డి టికెట్‌ను తొలి జాబితాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామ రాజుకు కేటాయించారు. కానీ, ఈ టికెట్ను త‌న‌కు కేటాయించాల‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన క‌లువపూడి శివ‌(శివ‌రామ‌రాజు) ప‌ట్టుబ‌డుతున్నారు. ఇప్ప‌టికే ఈయ‌న కారాలు మిరియాలు నూరుతున్నారు. టికెట్ త‌న‌కు ఇవ్వ‌క‌పోతే.. ఇండిపెండెంట్‌గా అయినా.. పోటీ త‌ప్ప‌ద‌ని తేల్చేస్తున్నారు.

మ‌రోవైపు.. తొలిజాబితాలోనే టికెట్ ద‌క్కించుకున్న రామ‌రాజు తొలి వారం పది రోజులు ఖుషీగా నే ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర్వాత నుంచి ఆయ‌న డీలా ప‌డిపోయారు. వైసీపీ రెబ‌ల్ ఎంపీ, ఇటీవ‌ల టీడీపీలోకి చేరిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు ఉండి టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో ఈయ‌న కూడా ఆగ్ర‌హం, ఆవేద‌న‌లో మునిగిపోయారు. తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. మ‌రోవైపు.. ఎంపీ ర‌ఘురామ క్ష‌త్రియ సామాజిక వ‌ర్గాన్ని కూడ‌గ‌ట్టి.. త‌న‌ను ఇక్క‌డ గెలిపించాల‌ని కోరుతున్నారు.

దీంతో ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచే స్థానంగా ఉన్న టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఎవ‌రికి టికెట్ ఇచ్చినా..(ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు) మ‌రో ఇద్ద‌రు రెబ‌ల్‌గా మారేందుకు రెడీ అవుతున్నారు. పోనీ. మార్చ‌కుండా ఉంటే.. ర‌ఘురామ చేసే తీవ్ర వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు త‌ట్టుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఆయ‌న త‌న‌ను వాడుకుని వ‌దిలేశార‌ని.. త‌న‌కు టికెట్ ఇవ్వ‌ని వాడు.. అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌కు టికెట్ ఇవ్వ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

అయితే.. కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు ఇలాంటి మార్పులు చేర్పుల‌తో ఓటు బ్యాంకుపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా మూడు పార్టీలు క‌లిసి ప‌నిచేయాల‌న్న పిలుపు ఇక్క‌డ వ‌ర్క‌వుట్ అయ్యే అవ‌కాశం కూడా క‌నిపించ‌డం లేదు. దీనిపై ఏదో ఒక‌టి తేల్చాల‌ని.. మ‌రో వారంలోనే నోటిఫికేష‌న్ రానుంద‌ని.. టీడీపీ నాయ‌కులు కూడా కోరుతున్నారు. ఎలా చూస్తున్నా.. మంతెన రామ‌రాజు, శివ‌రామ‌రాజు-ర‌ఘురామ‌రాజుల సెగ టీడీపీకి బాగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చంద్ర‌బాబు వీరిని ఎలా బుజ్జ‌గిస్తారో చూడాలి.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?