విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ అనేది ఫేమస్ హోటల్ అనేది అందరికీ తెలిసిందే. ఈ హోటల్ కు ఎక్కువగా ప్రముఖులే వస్తుంటారు. అయితే బుధవారం అనుకోని అతిధి బలవంతంగా వచ్చే ప్రయత్నం చేయడంతో హోటల్ సిబ్బంది షాక్ అయ్యారు. అయితే అలా వచ్చింది ఎవరో ప్రముఖ వ్యక్తి అయితే కాదు. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు విజయవాడ బస్టాండ్ వెళుతూ మార్గమధ్యలో స్వర్ణ ప్యాలెస్ లోకి దూసుకువెళ్లింది.

ఆ హాఠాత్ పరిణామానికి ప్రయాణీకులతో సహా అందరూ షాక్ కు గురైయ్యారు. అయితే హోటల్ గోడ అడ్డుగా ఉండటంతో ప్రమాదం తప్పింది. ఘటనలో ముగ్గురు ప్రయాణీకులకు గాయాలు అవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఈ ఘటనతో స్వర్ణ ప్యాలెస్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను క్లీయర్ చేశారు.

Read More: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ..ఎందుకంటే..?
సత్తుపల్లి నుండి విజయవాడ వరకూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ఆ బస్సుకు స్వర్ణ ప్యాలెస్ వద్దకు వచ్చిన సమయంలోనే అదుపుతప్పి దూసుకువెళ్లడం, గోడకు గుద్దుకుని ఆగిపోవడం ఓ విధంగా అదృష్టమనే చెప్పుకోవాలి. అదే రోడ్డుపై సిగ్నల్స్ వద్ద బస్సుకు బ్రేక్ ఫెయిల్ అయి వాహనదారులపై దూసుకుని వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. బస్సు ప్రమాద ఘటనపై అటు ఆర్టీసీ, ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read More: ఏపిలో రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్ .. సబ్సిడీపై గోధుమ పిండి పంపిణీ..కానీ..