20.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వాటిల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు

Share

నిర్దుష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌ చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా  ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైసీపీ సభ్యులు  వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె లిఖిత ప్వూరకంగా సమాధానం ఇచ్చారు.  సెస్సులు, సర్‌చార్జీలు ఇతర సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే వినియోగిస్తుందని ఆమె వెల్లడించారు. 2014 – 15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు సెస్సుల రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తాలను పట్టిక రూపంలో మంత్రి వివరించారు. 2014 – 15 లో సెస్సుల కింద కేంద్రం వసూలు చేసిన మొత్తం రూ.82,914 కోట్లు, అదే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెస్సుల రూపంలో వసూలైన మొత్తం రూ.3,52,728 కోట్లు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

Vijayasai Reddy Nirmala Sitaraman

 

కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు చెందాల్సిన వాటాపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ఫార్ములా వివరాల గురించి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందన్నారు. 2020 – 21 నుండి 2025 – 26 వరకు అమలులో ఉండే 15వ ఆర్థిక సంఘం అవార్డు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కోసం కొన్ని ప్రాతి పదికలను సూచించింది. రాష్ట్ర జనాభా సంఖ్యకు 15 శాతం,  భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, అటవీ, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వనరులకు 45 శాతం చొప్పున వెయిటేజి ఇచ్చింది.

వీటి ప్రాతిపదికపైనే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను నిర్ణయించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాతిపదిక ప్రకారం పన్నుల పంపిణీలో బీహార్‌కు 10 శాతం, ఉత్తర ప్రదేశ్‌కు 17 శాతం, మధ్య ప్రదేశ్‌కు 7 శాతం చొప్పున పొందగా ఆంధ్రప్రదేశ్‌ 4 శాతంకు మాత్రమే పరిమితమైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పన్నుల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.24,460 కోట్లు, 2021-22లో రూ.35,385 కోట్లు, 2022-23లో సవరించిన అంచనాల మేరకు రూ.38.176 కోట్లు లభించాయని మంత్రి వివరించారు. అలాగే 2023-24 బడ్జెట్‌ అంచనాల మేరకు కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్‌ వాటా కింద రూ.41,338 కోట్లు పంపిణీ చేయబోతున్నట్లు వెల్లడించారు.

YS Jagan: వైజాగ్ మకాం షిప్ట్ చేసిన వెంటనే .. బస్సు యాత్రకు ప్లాన్..?


Share

Related posts

Breaking: ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబును పార్టీ నుండి సస్పెండ్ చేసిన వైసీపీ

somaraju sharma

కార్పొరేషన్ల పదవులపై బీసీ నేతల్లో కానరాని సంతోషం! ఈ మెలికే అందుకు కారణం!!

Yandamuri

Nagarjuna: వచ్చే వారం నుండి రెడీ అయి పోతున్న కింగ్ నాగార్జున..??

sekhar