టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న గన్నవరం పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో గన్నవరం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా.. అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కావాలనుకుంటే గన్నవరం కాకపోతే అసొం కూడా వెళ్లొచ్చని అన్నారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నప్పుడు పోలీసులు ఎవరినైనా నియంత్రిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లొచ్చు, నడుముకి రాకెట్ కట్టుకుని ఆకాశంలోకి వెళ్లవచ్చు.. గోదాట్లో దూకి కుక్క తోక పట్టుకుని ఈదనూ వచ్చని సెటైర్ వేశారు.

గతంలో ముద్రగడను ఇంట్లో నుండి బయటకు రాకుండా మూడేళ్లు నియంత్రించారనీ, మంద కృష్ణమాదిగను ఏపిలోకి రాకుండా అయిదేళ్లు నియంత్రించారనీ, అప్పుడు ఏ రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు చేశారని వంశీ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే మరొకటా అని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటానని అనడం బాధాకరమని అన్నారు. బాలకృష్ణ సినిమాలు ఎక్కువాగ చూసినట్లున్నారు అందుకే బాలయ్య సినిమా డైలాగులు చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో లోకేష్ వ్యాఖ్యలపైనా స్పందించారు వంశీ. జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలవడం అతి పెద్ద జోన్ అని అన్నారు. టీడీపీ ఎప్పటికైనా ఎన్టీఆర్ పార్టీయేనని అన్నారు. వాళ్లు తాతగారి పార్టీని జూనియర్ ఎన్టీఆర్ చూసుకోగలరని అన్నారు.
చంద్రబాబు నిన్న గన్నవరం పర్యటనకు వెళ్లిన సందర్భంలో వైేసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు రోజుల క్రితం వంశీ వర్గీయులు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పు పెట్టారు. ఆ తర్వాత వైసీపీ, టీడీపీ శ్రేణుల మద్య పెద్ద ఎత్తున గొడవ జరగడం, అది ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు గన్నవరంలో నిషేదాజ్ఞలు విధించాారు. అయినప్పటికీ చంద్రబాబు గన్నవరం పర్యటనకు బయలుదేరిన సందర్భంలో పోలీసులు అక్కడి పరిస్థితిని వివరించారు. దీంతో తనను గన్నవరం వెళ్లవద్దనడానికి పోలీసులు ఎవరు, గన్నవరం ఏమైనా పాకిస్థాన్ లో ఉందా అంటూ చంద్రబాబు కామెంట్స్ చేశారు.