30.2 C
Hyderabad
March 27, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా ఒంగోలులో ట్రాఫిక్ ఆంక్షలు .. వాహనాల మళ్లింపు ఇలా..

Share

బాలకృష్ణ “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేదిక ను మార్పు చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఒంగోలులోని ఏబీఎం కళాశాల మైదానంలో ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేసుకోగా భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ప్రత్యామ్యాన స్థలం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు అధికారులు సూచించిన నేపథ్యంలో వేదికను మార్పు చేశారు. వేదికను అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్ కి మార్చినట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం అర్జున్ ఇన్ ఫ్రా వద్ద ప్రీరిలీజ్ ఫంక్షన్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలు ట్రాఫిక్ మళ్లింపును అనుసరించి పోలీసులకు సహకరించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు లు తెలిపారు. వాహనాల రాకపోకలకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లించటమైనదని చెప్పారు. వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చే వాహనాల మార్గములు, వెళ్లే మార్గాలు ఈ కింద విధంగా ఉన్నాయి.

Veera Simha Reddy Pre Release Event Traffic Diversions

వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వచ్చే వాహనాల మార్గాలు

1. గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుండి వచ్చే వాహనాలు కిమ్స్ ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్ ద్వారా అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో వాహనాలు పార్కింగ్ చేసుకొని ఈవెంట్ ప్లేస్ కు వెళ్లాలి.  2. నెల్లూరు, కావలి వైపు నుండి వచ్చే వాహనాలు ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించకుండా పెళ్లూరు ఫ్లై ఓవర్ పై నుండి నేరుగా కిమ్స్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు ద్వారా అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో వాహనాలు పార్కింగ్ చేసుకొని ఈవెంట్ ప్లేస్ కు వెళ్లాలి. 3. ఒంగోలు పట్టణం, కడప, కర్నూలు, మరియు చీమకుర్తి వైపునుండి ప్రీ రిలీజ్ కార్యక్రమంకు వచ్చే వాహనాలు కర్నూల్ బై పాస్ సెంటర్ మీదగా సర్వీస్ రోడ్డు ద్వారా మంగమ్మ కాలేజీ పార్కింగ్ చేసుకొని ఈవెంట్ ప్లేస్ కు వెళ్ళవలెను. 4. కొత్తపట్నం వైపు నుండి వచ్చే వాహనాలు కొప్పోలు ఫ్లై ఓవర్ మీదగా కిమ్స్ ఫ్లై ఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో వాహనాలు పార్కింగ్ చేసుకొని వెళ్లాలి.

ప్రీ రిలీజ్ కార్యక్రమం నుండి బయటకు వెళ్ళు వాహన మార్గాలు

1. గుంటూరు, విజయవాడ మరియు చీరాల వైపు వెళ్ళు వాహనాలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ పార్కింగ్ నుండి కల్వరి టెంపుల్ వద్ద NH -16 రోడ్డుకి ఎంట్రీ అయ్యి వెళ్ళాలి. 2. ఒంగోలు పట్టణం, కడప, కర్నూలు మరియు చీమకుర్తి వైపు వెళ్ళు వాహనాలు మంగమ్మ కాలేజ్ లో పార్కింగ్ చేసుకున్న వాహనాలు కర్నూల్ బై పాస్ సెంటర్ మీదగా వెళ్ళాలి.  3. నెల్లూరు, కావలి మరియు కొత్తపట్నం వైపు వెళ్ళు వాహనాలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నుండి కిమ్స్ సర్వీస్ రోడ్డు ద్వారా NH -16 రోడ్డుకి ఎంట్రీ అయ్యి వెళ్ళాలి.

ఒంగోలు టౌన్ లోనికి సాధారణ వాహనాలు వేళ్ళు మార్గం

విజయవాడ, గుంటూరు, చీరాల వైపు నుండి ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించే వాహనదారులు కిమ్స్ ఫ్లై ఓవర్ పై నుండి నేరుగా కొప్పోలు ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు ద్వారా కొత్తపట్నం బస్టాండ్ మీదుగా ఒంగోలు టౌన్ లోకి ప్రవేశించాలి.  ఒంగోలు టౌన్ నుండి విజయవాడ, గుంటూరు, చీరాల వైపు వెళ్ళు వాహనాలు కొప్పోలు ఫ్లై ఓవర్ సర్వీస్ రోడ్డు ద్వారా NH -16 మీదగా వెళ్ళాలి.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రజలు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడే వారు ఈవెంట్ కు దూరంగా ఉండటం మంచిందని వారు సూచించారు. ఈ ఈవెంట్ కు హాజరయ్యే వారు తప్పనిసరిగా నిర్వాహకులు జారీ చేసిన పాసులతో హాజరుకావాలనీ, . పాసులు లేని వారికి ఈవెంట్ లో అనుమతించరని తెలిపారు. అలాగే భద్రతా చర్యల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


Share

Related posts

Hight Growth: ఈ ఆటలాడితే చాలు పిల్లలు ఈజీగా హైట్ పెరుగుతారు..!!

bharani jella

బిగ్ బాస్ 4 : హోస్ట్ నాగార్జునకి బిగ్గెస్ట్ షాక్..! కేసు వేస్తామన్న నారాయణ..!!

Yandamuri

జబర్దస్త్ : హైపర్ ఆది మామూలోడు కాదు రో .. ఈ వారం మిస్ అవ్వకండి రో !

sekhar