మాట.. ఎన్నికల తూటా : కులం… రాజకీయ వ్యూహం.. !! పవన్ వ్యాఖ్యల వెనుక చాలా ఉంది

Share

పవన్ కళ్యాణ్ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అది స్నేహితులు… సన్నిహితులు చెప్పారమ్మ”

ఇది ఒక టీవీ ఇంటర్వ్యూ లో మంత్రి కొడాలి నాని ఓ ప్రశ్నకు బదులుగా ఇచ్చిన సమాధానం…. ఆయనకు పవన్ కళ్యాణ్ అంటే భయమా… లేక టెన్షన్ ఆ … అనే బోలెడు ప్రశ్నలు అప్పట్లో వచ్చాయి… తాజాగా పవన్ కళ్యాణ్ గుడివాడ వెళ్లి సభ వేదిక మీద నుంచి నాని ను విమర్శించడం…. దానికి మల్లి మంత్రి ప్రతి విమర్శ చేయడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.. అది అలా ఉంచితే అందరిపై బూతులతో, సూటి విమర్శలతో ముందుండే కొడాలి నాని అసలు పవన్ కళ్యాణ్ మీద ఇప్పటివరకు కనీసం విమర్శలు చేయకపోవడం… ఆయనను పల్లెత్తు మాట అనకపోవడం వెనుక పెద్ద రాజకీయం ఉంది అని రాజకీయ సర్కిల్స్ లో టాక్….


** రాజకీయాల్లో ప్రతి విషయం వెనుక… మాట వెనుక… చర్య వెనుక ఉండేది రాజకీయమే. అది కులం.. మతం.. డబ్బు… ఇతర అంశాలను ముడి పెట్టి ఉంటుంది.. ఎందుకు అంటే వాటికీ మాత్రమే ప్రజలు కాన్సెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వారి అటెన్షన్ తమ వైపు తిప్పుకోవాలంటే వీటిలో ఎదో ఒకటి పెద్దది చేయాలి.
** ఏపీ రాజకీయాల్లో కులం పాత్ర ప్రధానం.. ఎక్కువ దీని మీదనే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు రాష్ట్రంలో ప్రధానమైన కమ్మ, కాపు కులాల మధ్య ఉన్న అంతర్గత విబేధాలను మరో సారి తెరపైకి తీసుకు రావాలంటే.. కచ్చితంగా ఒకరకమైన ఘర్షణ వాతావరణం ఏర్పడాలి. మన కులం వాడిని మనమే తిట్టుకోవాలి అనే విభిన్నమైన కాన్సెప్ట్ అన్ని పార్టీలు ఆంధ్రాలో ప్రోత్సహాహిస్తాయి. ఎప్పుడు కమ్మ కులానికి చెందిన కొడాలి నాని కాపు కులానికి చెందిన పవన్ కళ్యాణ్ ను ఏమైనా అంటే అది పెద్ద ఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది.
** కాపులకు కమ్మ కులానికి ఎప్పటి నుంచో ఒక రకమైన విద్వేషం నడుస్తుంది. అది వంగవీటి రంగ, దేవినేని వర్గాల మధ్య కుమ్ములాటలతో పూర్తిగా రచ్చకి ఎక్కింది. ఫైర్ బ్రాండ్ గ పేరున్న నాని పవన్ ను ఏమైనా అంటే అది ఇప్పటికే ఐక్యత లేని కాపు వర్గాలకు ఒక ఆయుధం అవుతుంది. మన కులం కి సంబందించిన నాయకుడిని అందులో ఓ పార్టీ ని నడిపిస్తున్న వ్యక్తిని కమ్మ కులానికి చెందిన ఓ ఫైర్ బ్రాండ్ మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అది కాపుల్లో పవన్ కు పాజిటివ్ దృష్టిని తీసుకువస్తుంది.


** అందుకే కొడాలి నాని ను కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు ను తిట్టేందుకు, విమర్శించేందుకు మాత్రమే ఉపయోగిస్తారు.. ఆయన పవన్ ను తిడితే అది పవన్ కు ప్లస్ అనేది వైస్సార్సీపీ ఎప్పుడో గుర్తించే .. ఆయనకు పవన్ పని అప్పగించడం లేదు.
** ఇక కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి దగ్గర ిన వ్యక్తి. జూనియర్ తో సాంబ లాంటి సినిమా తీసి… సినీ పరిశ్రమతో సైతం ఆయనకు సంబంధాలు ఉన్నాయి. సినిమా పరిశ్రమ లో మెగా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మధ్య ఉండే సన్నని పోటీ ఘర్షణ వాతావరణం కూడా కొడాలి వ్యాఖ్యలతో దెబ్బ తినొచ్చు. అది మరింత ఎక్కువగా మరి పెద్ద గొడవలకు దరి తీసే అంశం ఉంది.
** జనసేన అధ్యక్షుడు పవన్ సైతం ఒక వ్యూహం ప్రకారమే.. నాని ఇలాకాలో నాని మీద వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది… నాని దీనికి ప్రతిగా స్పందించిన వ్యాఖ్యల వాళ్ళ ఎప్పటికి ఎప్పుడు వచ్చే నష్టం ఏమి ఉండకపోవచ్చు.. ఐతే గత ఎన్నికల్లో కాపుల ఓట్లు సైతం సాధించలేకపోయిన పవన్ ఎప్పుడు ఆ వర్గం ఓట్ల మీద ప్రధాన ద్రుష్టి పెట్టినట్లు కొన్ని సంకేతాలు అందుతున్నాయి.. దీని వల్లనే వచ్చే ఎన్నికల్లో కాపులని సంఘటితం చేసి.. అంతర్గతంగా వారిని ఒక తాటి పైకి తీసుకువచ్చి పార్టీ వైపు నడిపించాలి అనేది ప్రధాన వ్యూహం… దీనిలో భాగంగానే వంగవీటి రాధా ను మల్లి పార్టీలోకి ఆహ్వానించడం గని… గుడివాడ లో నాని ను విమర్శించడం కానీ దానిలోనే చూడాలన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ.


Share

Related posts

Bollywood :బాలీవుడ్ ఇండస్ట్రీని మళ్ళీ కుదిపేస్తున్న కరోనా..!

GRK

అమెజాన్ అకౌంట్ ఉందా? అయితే త్వరపడండి.. 5 రూపాయలకే బంగారం కొనుక్కునే గోల్డెన్ చాన్స్

Varun G

Neha sharma new looks

Gallery Desk