NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మద్యపాన నిషేధం అంటే ఎక్కువ తాగించడమా?? : లిక్కర్ అమ్మకాల్లో రికార్డు

 

 

మనిషి ఏది వద్దంటే అదే ఇష్టంగా చేస్తాడు… దేనిలో ప్రమాదం ఉందని హెచ్చరిస్తే అటువైపే వెళ్తాడు… దేని వల్ల నువ్వు ఇబ్బంది పడతావు అని చెబితే దాన్ని చేస్తాడు…. బేసికల్గా మంచి కన్నా చెడు ప్రభావం ఎక్కువ… ఇది సైకలాజికల్ థియారీ… కాస్త మానసిక శాస్త్రం మీద పట్టు ఉన్న వారికి ఎవరికైనా దీని లోతు పాతులు తెలిస్తే… ఇలాంటి మానసికమైన ఆటనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆడుతోంది.. మద్యపాన నిషేధం విషయంలో జగన్ ప్రభుత్వం ఆడుతున్న ఆట ఇదే… దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఇదే… మద్యం అమ్మకాల విషయంలో ఏపీ రికార్డుల మీద రికార్డులు కొడుతోంది. ఓపక్క మద్యపాన నిషేధం అంటూ దశలవారీగా మద్యం దుకాణాలను ఎత్తివేస్తూ ఉన్నామంటూ చెబుతున్న ఏపీ సర్కారు అమ్మకాల్లో మాత్రం జోరు తగ్గించడం లేదు. ఎంత రేట్లు పెరిగితే అంత మద్యం అమ్మకం అవుతోంది… మద్యం రేట్లు పెరిగే కొలది అమ్మకాలు తగ్గిన రేట్లు పెరిగిన దాన్ని… చక్కగా ప్రభుత్వం కవర్ చేస్తోంది… కవర్ చేయడం కాదు ఇంకా అమ్మకాల్లో ముందుకు దూసుకుపోతోంది… డిసెంబర్ నెలలో ఎన్నడూ లేనట్లుగా గత రికార్డులన్నీ తిరగరాసింది. ఏకంగా 2,300 ఓట్లు మద్యం అమ్మడం గతంలో ఎన్నడూ లేని రికార్డు. రోజుకు సుమారు 68 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. గత ఏడాది మొత్తం మీద సుమారు 13 వేల కోట్ల రూపాయలను మద్యం ఆదాయం కింద ప్రభుత్వం ఖజానాలో వేసుకుంది. కొత్త సంవత్సరం ఎలా సుమారు 100 కోట్ల వ్యాపారం జరిగింది ఇది గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికం…

చివరి సంవత్సరం చేస్తే….

మద్యపాన నిషేధంపై దశలవారీగా ముందుకు వెళ్తామని జగన్ ఇప్పటికే చెప్పారు. దీనిలో భాగంగా సుమారు 33శాతం షాపులను తొలగించారు. ప్రభుత్వమే మద్యం అమ్మేందుకు పూనుకుంది. ధరలు పెంచితే మద్యం తాగడం తగ్గిపోతుందని… కొత్త నిర్వచనాలు చెప్పి మద్యం ధరలు అమాంతం పెంచేశారు. మరోపక్క స్థానిక రిస్కు అనుమతినిస్తూ ఎక్కడపడితే అక్కడ అనేక రకాల బ్రాండ్ల మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. విచిత్రమైన బ్రాండ్ సైతం ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నాయి. వాటి ధర కూడా చాలా అధికంగా ఉంది. మరోపక్క మద్యం దుకాణాలకు అదనంగా మద్యం షాపింగ్ బాల్ ను ప్రారంభించి అక్కడ మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. మరో పక్క పక్క రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా నిఘా పెడుతూ… ఖచ్చితంగా రాష్ట్రం మద్యం అమ్మేలా చర్యలు తీసుకుంటున్నరు. ప్రస్తుతం ప్రభుత్వానికి మధ్యనే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ మద్యం ఆదాయం సరిపోక ఇప్పటికే పలు మార్గాల ద్వారా అప్పులు తీసుకొస్తున్నారు. అయినా ఆదాయం ప్రభుత్వం నిర్వహణకు సరిపోవడం లేదు. మరి ఈ సమయంలో జగన్ ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ ఎంతవరకు అమలవుతుంది అనేది సందేహమే. లేక ఎన్నికల వేళ హడావుడిగా మద్యపాన నిషేధం తీసుకువచ్చిన దాన్ని ఏ మేర జగన్ ప్రజలకు సంజాయిషీ ఇవ్వగలరు అనేది పెద్ద ప్రశ్న.

ఎం చెయాలి??

మద్యపాన నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది దీనిపై జగన్ సైతం.. అంతర్గత సమావేశాల్లో అధికారులకు కచ్చితంగా చెప్పే మాట. అయితే ఇప్పుడు ఒకవైపు అప్పులు మరోవైపు రాష్ట్ర విభజన దృష్ట్యా ఆదాయం లేని… రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ఆదాయం సైతం ఆగిపోతే కనీసం ప్రభుత్వ నిర్వహణకు చాలా ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని జగన్ గుర్తించారు. ఓపక్క మద్యపాన నిషేధం మద్యం నియంత్రణకు కట్టుబడి ఉన్నామని అందుకే మద్యం ధరలు భారీగా పెంచుతున్నామని చెబుతూనే… మరోపక్క మద్యం ఆదాయం ఏమాత్రం తగ్గకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికోసమే జగన్ సైకలాజికల్ గేమ్ సిద్ధం చేశారు. ప్రతిపక్షాలకు దొరక్కుండా ఎటువైపు మద్యం నియంత్రణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకోవడానికి… జగన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే మద్యం ఆదాయం మాత్రం గణనీయంగా రాష్ట్రంలో పెరగడం ఇప్పుడు సర్కార్కు కొత్త బలాన్నిస్తుంది. ఓ పక్క మద్యం ధరలు పెరిగి అమ్మకాలు తగ్గినా… పెరిగిన మద్యం ధరలు మాత్రం ప్రభుత్వానికి మంచి చేస్తున్నాయి. మధ్య పాన నిషేధం విషయంలో… జగన్ కర్ర విరగకూడదు పాము చావాలి అన్న విధానాన్ని పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.

author avatar
Comrade CHE

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju