NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ

Tarak : తారక్ మాటల్లో చాలా మర్మం ఉంది!

NTR

Tarak : అభిమానులు, దగ్గరి వారు tarak తారక్ అని పిలుచుకునే నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ తాను రాజకీయాల్లోకి వచ్చే విషయంలో క్లారిటీ తో నే ఉన్నారు అనిపిస్తోంది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమో లాంచింగ్ సమయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన అడిగిన ప్రశ్నకు దాటవేత సమాధానం ఇచ్చిన, దానిలో పెద్ద అర్థం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఖచ్చితంగా తారక్ రాజకీయాల మీద తాను మాట్లాడబోనని చెప్పలేదని ఆయన మనసులో దీని మీద స్పష్టమైన అభిప్రాయం ఉంది అనేది తెలుస్తోంది.

Tarak
Tarak

** జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పం వెళ్లిన సమయంలో సైతం అభిమానులు పదేపదే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు. అయితే దీని మీద చంద్రబాబు కు ఎలాంటి సమాచారం లేదు. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు తో మాట్లాడి సైతం చాలా రోజులు అయింది.

** జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలని కొందరు కమ్మ సామాజికవర్గ నాయకులు పారిశ్రామికవేత్తలు ఒక రాయబారాన్ని ఎప్పుడో తారక్ ముందు ఉంచారు. అయితే ఆయన దీనిపై సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

NTR

** 2009 ఎన్నికల్లో టిడిపి తరఫున బలంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను తర్వాత చంద్రబాబు సరైన రీతిలో వాడుకోలేదు అన్నది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా లోకేష్ కోసం తారక్ ను పార్టీకి దూరం చేశారని, అలాగే ఆయన నాన్న హరికృష్ణ సైతం చంద్రబాబు సరైన ప్రాధాన్యం తగ్గించలేదు అన్నది జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి వచ్చే ప్రధానమైన ఆరోపణ. ఇక ఆయన కుటుంబం నుంచే తెలంగాణ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి సుహాసిని ను ఓడిపోతామని తెలిసి చంద్రబాబు బరిలోకి దించారు అన్నది కూడా జూనియర్ ఎన్టీఆర్ వర్గం నుంచి వచ్చిన విమర్శ.

దీంతో సన్నిహితులు కొందరు రాజకీయ విశ్లేషకులు జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడానికి ప్రచారం చేయడానికి ఇది సరైన సమయం కాదని, సినిమాలు చేసుకుని ప్రస్తుతం సైలెంట్గా ఉండాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతోనే ఆయన పూర్తిగా సైలెంట్గా తన పాత పద్ధతిలో సినిమాలు చేసుకుంటున్నారు.

** జూనియర్ ఎన్టీఆర్ మరి ఎప్పటికీ రాజకీయాల్లోకి రారా అన్న ప్రశ్నకు మాత్రం జవాబు కనిపిస్తోంది. ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. రాజకీయాలంటే తనకు ఆసక్తి లేదని ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం అని చెప్పడంలో ఆంతర్యం ఉండనేది రాజకీయ విశ్లేషకుల మాట. కచ్చితంగా సరైన సమయంలో నందమూరి వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ఆయన వద్ద భవిష్యత్తు ప్రణాళిక ఉంది అనేది సన్నిహితులు చెప్పే మాట. అంటే భవిష్యత్తులో కచ్చితంగా ఆయన నుంచి రాజకీయాలు ఆశించవచ్చు అన్నమాట.

author avatar
Comrade CHE

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?