NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

అప్పు అంటే భయమేలా… చేసేస్తే పోలా !! ఏపీ దివాళాకు సిద్ధం

నాకు అసలే అప్పు అంటే భయం… మధ్యతరగతి వాడిని కాదండి.. ఉన్నదాంట్లో కలో గంజో తాగేసి ఈ రోజుకి మామ అనిపించి చేస్తే సరిపోతుంది… ఎందుకీ అనవసర అప్పులు ఎందుకు అనవసర అర్భాటాలు… ఉన్న దానిలో సర్దుకుందాం… అని ఆలోచించే మనస్తత్వం…. అందుకే అప్ప అంటేనే భయం… దానిని చేయాలంటే మహా భయం… ఒక్కోసారి దాని పేరు ఎత్తిన భయమే… అప్పుడు మహా సేటు రవి అని చిన్నప్పుడు నుంచి నాన్న చెప్పిన మాటలు మరి నిత్యం స్మరణ కు వస్తూనే ఉంటాయి… మరి అలాంటి భయంతో కూడిన రికార్డు ఉన్న నేను ఇప్పటివరకు రూపాయి అప్పు ఎవరి వద్ద తీసుకోలేదు… అది మన ట్రాక్ రికార్డ్…. ఇలా అనుకోని సంబర పడి పోకండి… ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ప్రతి ఒక్కరి నెత్తిమీద మీకు తెలియకుండానే… 73,811 రూపాయలు… అక్షరాలా డబ్బాయి మూడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు. ( ఇప్పటి వరకు తేలింది మాత్రమే ) అప్పు ఉంది… అదేంటి నేను ఎప్పుడు చేశాను నాకేం సంబంధం అనుకోకండి… ఇది మీ పేరుమీద ప్రభుత్వం చేసిన అప్పు… రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలియకుండానే మీ పేరున చేసిన అప్పు… గత నాలుగు నెలల్లోనే మీమీద 13 వేల పైగా అప్పు చేసింది.

అప్పుల సంక్షేమం!!

రాష్ట్ర ప్రభుత్వం తీరు విచిత్రంగా వింతగానే ఉంది. బ్యాంకులు రుణ సంస్థలు ప్రభుత్వాలు వివిధ మార్గాల ద్వారా విపరీతంగా అప్పులు చేస్తోంది. జగన్ ప్రభుత్వం గత సంవత్సరం లోనే లక్ష కోట్లకు పైగా అప్పు చేసినట్లు కాగ్ నివేదిక చెబుతోంది. చేసినప్పుడు లో సింహభాగం సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ప్రతి సంక్షేమ పథకం నగదుతో ముడిపడి ఉండటంతో వాటిని నెరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం అప్పుల కుప్ప గా రాష్ట్రాన్ని తయారుచేసింది. ముఖ్యంగా నవరత్నాలు పేరుతో జగన్ ప్రభుత్వం మొదలు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రభుత్వాన్ని అప్పులపాలు చేస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో జగన్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు నడుస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అభివృద్ధి కార్యక్రమాల మీద అంతగా దృష్టి పెట్టిన ప్రభుత్వం నవరత్నాల మీదే ప్రధానంగా దృష్టి పెట్టింది. వాటిని తీర్చేందుకు ఇష్టానుసారం అన్ని మార్గాలను ఉపయోగించుకొని అప్పులు చేస్తోంది. అంటే అప్పులు చేసి మళ్లీ ఆ డబ్బులు ప్రజలకు ఇస్తోంది.

దీనివల్ల ప్రయోజనం ఎంతో తెలియదు కానీ ప్రభుత్వానికి వడ్డీల భారం పెరిగి తర్వాత నిర్వహణ కష్టమైన పరిస్థితులు వస్తాయి. ఒక పరిమితికి మించి ప్రభుత్వ పనులు చేయడానికి వీలు ఉండదు. దీనికి రిజర్వు బ్యాంకు నిబంధనలు గైడ్లైన్స్ ఉంటాయి. గతంలోనే రిజర్వ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించింది. వచ్చే ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని, తర్వాత వీటిని పరిష్కరించడం కట్టుకోవడం కష్టమవుతుందని ఓ సారి గట్టిగా మందలించింది. అయితే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ అప్పు పెరుగుతుంది తప్ప.. ఆదాయం పెంచుకునే మార్గాలు వెతకడం లేదు. పోనీ ఆదాయం పెంచుకునే మార్గాలను అభివృద్ధి చేసుకోడానికి అయినా చేస్తున్న అప్పులు ఖర్చు పెట్టింది లేదు.

దివాళా తీస్తే??

విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం చాలా తక్కువ. ముఖ్యంగా హైదరాబాద్ నగర ఆదాయం మొత్తం తెలంగాణకు వెళ్లిపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు పెద్దగా ఆదాయం వచ్చే ఇచ్చే వ్యవస్థలు దాదాపు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ఖర్చుల భారం అధికమైంది. కొత్త రాజధాని నిర్మాణం తో పాటు ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. ఈ సమయంలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు మొత్తం ప్రాధాన్యమిచ్చారు. మరి కార్యక్రమం తీసుకోకుండా కేవలం తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు నవరత్నాలు అమలు చేసే బాధ్యతను ఆయన భుజానికెత్తుకున్నరు. నవరత్నాల్లో అమలయ్యే పథకాలన్నీ నగదు జమ పథకాలు కావడంతో అప్పులు తీసుకురావడం ప్రజలు అకౌంట్లోకి వాటిని జమ చేయడంతో ప్రభుత్వం నెట్టుకువస్తోంది. దీంతోనే ప్రతినెల నిర్వహణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రాష్ట్రం దివాలా తీసే అవకాశాలు లేకపోలేదని కాగ్ తన నివేదికలో తేల్చిచెప్పింది. ఏ రాష్ట్రం దివాలా తీయడమంటే… ఆదాయం కంటే అప్పులు అధికమై కట్టలేని పరిస్థితి రావడం.. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు కడుతూ కొంత కొంత అసలు జమ చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కడుతున్న వడ్డీలు జమ తక్కువైంది తీసుకున్న అప్పులు ఎక్కువైంది అని కాగ్ పేర్కొంది…..

author avatar
Comrade CHE

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!