Subscribe for notification

ఆరోగ్యం బాగోక పోతే కుట్రలు చేస్తారా?? ఇదేం లాజిక్ అఖిల!!

Share

 

 

అప్పటివరకు ఇళ్లలో ఉంటారు…. రక రకాల కుట్రలు చేస్తారు…. ఎవరెవర్నో కిడ్నాపులు చేపిస్తారు… బెదిరింపుల్లో గొంతు ఎత్తుతారు…. కానీ వారు అనుకున్నది బెడిసికొడితే మాత్రం వెంటనే అనారోగ్యం వచ్చేస్తుంది… కళ్ళు తిరిగి పడిపోతారు. భోజనం కూడా సహించం అంత వాంతులు అయిపోతాయి… ఇప్పుడు భూమా అఖిలప్రియ వివాదంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో అఖిలప్రియ కడుపుతో ఉందని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగా లేదని సింపతీ రాతలు చూస్తుంటే ఇదే అనుమానం వస్తుంది… ఇంట్లో ఉంటే కుట్రలు చేస్తారు… అది బయట పడగానే హాస్పిటల్ లో పడతారు అన్నట్లుంది తీరు. భూమా అఖిలప్రియ పోలీసు కస్టడీలో వ్యవహరిస్తున్న తీరు పోలీసులకు నవ్వు తెప్పిస్తోంది…

 

ఎందుకీ కుట్రలు మరి!!

హైదరాబాద్ హాఫిజ్ పేట భూమి వివాదంలో ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావుల అపహరణ విషయంలో ఇప్పటికే భూమా అఖిలప్రియ ను ఏ1 గా చేర్చి అరెస్టు చేశారు. ఈ విషయంలో దర్యాప్తు లోతుకు వెళ్లేకొలదీ పోలీసులకు కుట్ర కోణాలు బయట పడుతున్నాయి. కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్లాన్ కు అంతా స్కెచ్ వేసింది భూమా అఖిలప్రియ అన్నది పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె భర్త భార్గవ్ రామ్ తో పాటు గుంటూరు శ్రీను కేవలం పాత్రధారులే అని పోలీసుల విచారణలో తేలింది. అపహరించి, బెదిరించి, సంతకాలు పెట్టేంచే క్రమం అంతా అఖిల ప్రియ కనుసన్నల్లోనే జరిగింది. ముగ్గురి ని ఎలా అపహరించారు అనే దానిని తర్వాత ఫామ్హౌస్కు ఎలా తీసుకురావాలనే విషయాన్ని ఎప్పటికప్పుడు అఖిలప్రియ ఫోన్ ద్వారా సూచనలు చేసింది. కిడ్నాప్కు ఉపయోగించిన వాహనాలకు అనధికారికంగా ప్రభుత్వ వెహికల్స్ అనే స్టిక్కర్ లను అతికించి.. పోలీస్ డ్రెస్సుల్లో అనుచరులను ఉంచి… ఆ ముగ్గురిని భూమా అఖిలప్రియ దగ్గరుండి కిడ్నాప్ చేయించారని తెలుస్తోంది. ఈ కేసులో భూమా అఖిలప్రియ పేరు బయటకు వచ్చినప్పుడు అంతా బాగానే ఉన్నా ఆమె పోలీసులు కస్టడీలోకి వెళ్లగానే ఆరోగ్యం బాగా లేదంటూ నాటకం మొదలు పెట్టడం… కొత్త డ్రామాకు తెరతీయడం విశేషం. వందల కోట్ల విలువైన భూమి కాగితాలు సైతం నకిలీ పుట్టినట్లుగా పోలీసులు దర్యాప్తులో తెలుస్తోంది. తెల్ల కాగితాలు లేదా ప్రామిసరీ నోట్లు…, దస్తావేజులు మీద బలవంతంగా సంతకం చేయించుకునేందుకు అఖిల ప్రియ ప్రయత్నించినట్లు తెలిసింది. మరి ఇన్ని చేసిన ఆమె ఒక్కసారిగా అనారోగ్యం ఎందుకు అయ్యారు అంటే దానికి ఆమె గర్భిణీ అని… ఆరోగ్యం సరి లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ఇప్పుడు నానా యాగీ చేయడం కనిపిస్తోంది.

ఆమె చెల్లె మాటల్లో

ఇప్పటి వరకు మీడియా ముందుకు రాని భూమా అఖిలప్రియ చెల్లెలు మౌనిక శుక్రవారం మీడియా ముందుకు వచ్చి తమ అక్కకు ఆరోగ్యం సరిగా లేదని కెసిఆర్ తమకు దగ్గరే అవుతారని చాలాసార్లు కేటీఆర్ కవిత మాట్లాడారంటూ చెప్పడం చూస్తే ఇప్పుడు ఈ వివాదాన్ని మొత్తం… భూమా అఖిలప్రియ ఆరోగ్యం మీద తీసుకు వెళ్లాలని ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది. ఆమెకి ఆరోగ్యం సరిగా లేకపోతే పోలీస్ కస్టడీలోనే వైద్య సహాయం అందించవచ్చు. కేసు చాలా కీలకం కాబట్టి ఇప్పుడు భూమా అఖిలప్రియ కు బెయిల్ ఇస్తే కనుక కేసు తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆమె బెయిల్ కోరుకుంటున్నది కూడా ఇందుకే.. ఈ విషయం పోలీసులకు తెలిస్తే భూమా అఖిలప్రియ బెయిల్ విషయంలో పోలీసులు గట్టిగా నిలబడి ఆమె బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతున్నారు. దీనిపై వారు ఇప్పటికే నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే ఎప్పటి వరకు గుర్తుకురాని ఆరోగ్యంపై కొన్ని మీడియా చాన్నాళ్లు కావాలనే అతి చేస్తున్నాయని… ఎలాంటి విషయం లేకుండా పెద్దవి చేస్తున్నాయి అని తెలుస్తోంది. ఆరోగ్యం సాకుతో అఖిలప్రియ బయటకు వస్తే కేసు మొత్తం వృధా అవుతుంది అనేది పోలీసుల మాట..


Share
Comrade CHE

Recent Posts

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

15 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

45 mins ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

45 mins ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడిలో 18 మంది మృతి.. 30 మందికి గాయాలు

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…

2 hours ago