NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

పక్క షేమ్! ఇలాంటి వారితో నెట్టుకురాలేవు జగన్!

 

 

ఒకపక్క ఎన్నికల కమిషన్కు జగన్కు నువ్వా నేనా అన్నట్లు పైట సాగుతుంటే… మరోపక్క దానిలో కీలకంగా వ్యవహరించాల్సిన అధికారులు న్యాయ నిపుణులు మాత్రం ఆయనను ఓడించడానికి చూస్తున్నారు. అంటే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న సరే పక్కనున్న బ్యాట్స్మెన్ కనీస మద్దతు ఇవ్వడం లేదన్నమాట. ఇది బృంద క్రీడ. అందరూ కలిసి చక్కగా ఆడితేనే విజయం సాధ్యమవుతుంది అందులోనూ అటుపక్క అతి తెలివైన ఆసిస్ ఆటగాళ్లు ఉంటే.. టీంను ఏవో చిన్న చిన్న సిల్లీ పాయింట్ లను చెప్పి ఓడించడానికి మిగిలిన సభ్యులు పూనుకోవడం కెప్టెన్కు తలవంపులు గానే తయారవుతుంది. రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తీర్పు రాగానే పాత నోటిఫికేషన్లు ఇచ్చిన తేదీల్లోనే స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వడివడిగా అడుగులు వేస్తుంటే మరోపక్క దీన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు… పకడ్బందీగా ముందుకు వెళ్లాల్సిన జగన్ ప్రభుత్వం అధికారులు మాత్రం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ చెబుతోంది. సుప్రీం కోర్టు నిబంధనలకు ఏమాత్రం తగ్గకుండా వేసిన ఈ పిటిషన్ వల్ల… శుక్రవారం దాన్ని స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నేను ఆకర్షించడం జగన్ ప్రభుత్వానికి తలంపులే. పోరాడడానికి అన్ని యుక్తులను సిద్ధం చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్… న్యాయ పరంగా తగిన పిటిషన్ కూడా వేయలేరా అంటూ ప్రతిపక్షాలు ఇప్పుడు వెక్కిరిస్తున్న బెదిరింపులకు అవమానభారంతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

ఢిల్లీ లాబీ దారుణమా!

వైయస్సార్ సిపి పార్టీ లో ఢిల్లీ లాబీ చాలా దారుణంగా ఉందనేది ఫస్ట్ నుంచి వస్తున్న మాటే. ప్రతి విషయాన్ని విజయసాయిరెడ్డికి అప్పగించేసి… కేవలం ఆయన ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టే అంత స్వేచ్ఛ ఇచ్చిన విజయసాయిరెడ్డి దానిని పక్కాగా నిర్వహించడంలో ఎక్కడో విఫలమవుతున్నారు. ఢిల్లీ లాబీని మొత్తం తానే చూసుకుంటానని అందరికీ చెబుతున్నా పార్టీలో వారు సైతం విజయసాయిరెడ్డి వైఖరి పట్ల అసహనంతో నే ఉన్నారు. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో అత్యవసర రివ్యూ పిటిషన్ ను తయారు చేయడంలో సుప్రీంకోర్టు నిబంధనల మేరకు దానికి అనుగుణంగా లాయర్లతో సరైన పిటిషన్ వేయించడం లేదు అక్క గా వ్యవహరించడం లోనూ మరోసారి వైఎస్ఆర్సిపి ఢిల్లీ లాబీ ఎంత బలహీనంగా ఉందో అర్థం అయ్యింది. శనివారం కనుక ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ కు అనుగుణంగా నామినేషన్ల ప్రక్రియ కు శ్రీకారం చుడితే మళ్ళి దీనిని అడ్డుకోవడం వైఎస్ఆర్సిపి కు అసాధ్యమే. ఎన్నికల ప్రక్రియ మొదలైనట్లే. అప్పుడు ఎన్నికల ప్రక్రియ మధ్యలో పిటిషన్ వేసి దానిని అడ్డుకోవడం అనేది దాదాపు అసాధ్యమే. అంటే తాత్కాలికంగా జగన్ ఓడిపోయినట్లే. సుప్రీం కోర్టులో శుక్రవారం కనుక రివ్యూ పిటిషన్ ఓకే అయి ఉంటే విచారణకు తీసుకుని ఉంటే… ఎన్నికల ప్రక్రియను ఎలాగోలా లాబీ చేసో లేకపోతే.. మరే పద్ధతుల ద్వారా ను అడ్డుకునేందుకు ఓ అవకాశం ఉండేది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలయిన తర్వాత అత్యున్నత ధర్మాసనం సైతం దీనిలో వేణు పెట్టేందుకు అంతగా ఇష్టపడదు. ఇది ఖచ్చితంగా జగన్ ఢిల్లీ లాబీ వైఫల్యమే.

 

ఉద్యోగ సంఘాలు ఎం చేస్తాయి??

శనివారం కనుక ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టినట్లు ప్రకటిస్తే… దానికి అనుగుణంగా ఉద్యోగ సంఘాలన్నీ ఆయన చెప్పినట్లు నడుచుకోవాల్సి ఉందే. అలా కాకుండా సహాయనిరాకరణ వైపు వెళ్తామని… తాము విధుల్లోకి వచ్చేది లేదని అంతా ఐకమత్యంగా ఉన్నా సరే దీనిలో పెద్దగా ఉపయోగం ఉండదు. ఎన్నికల కమిషనర్ కు రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఉద్యోగ సంఘాల కావాలనే ఎన్నికలను బహిష్కరిస్తున్నాయని, దీని వెనక ఒక కుట్ర కోణం ఉందని కచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు జరగవలసి ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు చెప్పి దానికి అనుగుణంగా రాజ్యాంగ సూత్రాలను పాటించాల్సిందేనని ఉద్యోగ సంఘాలకు చెబితే వారు కూడా చేసేది ఏమీ ఉండదు. ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకరించి తీరాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఎన్నికలను ఆపడం ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టకుండా నిలువరించడం అనేది అంత చిన్న విషయం ఏమీ కాదు. ఉద్యోగ సంఘాల ద్వారా సహాయ నిరాకరణకు పిలుపునిచ్చి అధికారులు సైతం తాము విధుల్లో పాల్గొనే అని చెబితే అది కొత్త సమస్యలకు దారి తీయవచ్చు. అలాగే దీనిలో గవర్నర్ కలగజేసుకుని ఎన్నికల సంఘానికి అనుకూలంగా తగిన సూచనలు చేయవచ్చు. అయితే ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలైతే కనుక ఎన్నికల సంఘానికి ఇక పూర్తి స్వేచ్ఛ అధికారం వచ్చేసినట్లే.. అప్పుడు ఎవరు ఏమి చెప్పినా వారు వినను కూడా వినరు.

author avatar
Comrade CHE

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju